Telugu Global
National

ఊడుతున్న ఉద్యోగాలు... 20ఏళ్ల కనిష్ట స్థాయికి అమ్మకాలు...

దేశంలో ఆటోమొబైల్ రంగం సంక్షోభం దిశగా పయనిస్తోంది. లక్షల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వాహనాల ఉత్పత్తిని కంపెనీలు తగ్గించేశాయి. ఆటోమొబైల్ రంగంలో వాహనాల అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయి కలవరపెడుతున్నాయి. జులైలో నమోదైన అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయిని సూచించాయి. అమ్మకాలు లేకపోవడంతో ఏప్రిల్- జులై మధ్యలో దేశీయ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిని కంపెనీలు 13. 18 శాతం మేర తగ్గించాయి. మారుతీ, మహీంద్రా, టాటా, ఫోర్డ్, టొయోటా కంపెనీలు భారీగా ఉత్పత్తిని తగ్గించాయి. […]

ఊడుతున్న ఉద్యోగాలు... 20ఏళ్ల కనిష్ట స్థాయికి అమ్మకాలు...
X

దేశంలో ఆటోమొబైల్ రంగం సంక్షోభం దిశగా పయనిస్తోంది. లక్షల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వాహనాల ఉత్పత్తిని కంపెనీలు తగ్గించేశాయి. ఆటోమొబైల్ రంగంలో వాహనాల అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయి కలవరపెడుతున్నాయి. జులైలో నమోదైన అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయిని సూచించాయి.

అమ్మకాలు లేకపోవడంతో ఏప్రిల్- జులై మధ్యలో దేశీయ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిని కంపెనీలు 13. 18 శాతం మేర తగ్గించాయి. మారుతీ, మహీంద్రా, టాటా, ఫోర్డ్, టొయోటా కంపెనీలు భారీగా ఉత్పత్తిని తగ్గించాయి.

కేంద్రం విధించిన పన్నుల కారణంగా ప్రస్తుతం రవాణా రంగం ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటోంది… కాబట్టి ఇప్పుడు కొత్తగా ట్రక్కులను కొనవద్దని ఇటీవలే రవాణా సంఘాలు తమ సభ్యులకు సూచించాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతోంది.

గతేడాది ఏప్రిల్- జులై మధ్యలో ద్విచక్రవాహనాల ఉత్పత్తి 87 లక్షలుగా ఉంది. అయితే ఈ ఏడాది అది 10 శాతం తగ్గిపోయింది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి ఈ ఏడాది 13 శాతం క్షీణించింది.

అమ్మకాలు తగ్గిపోవడం, ఉత్పత్తిని కంపెనీలు తగ్గించడంతో ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలు ఆటోమొబైల్ రంగంలో కోతపడ్డట్టు అంచనా. ఆటోమొబైల్ రంగం ఇలా కుదేలవడానికి అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో పాటు భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అస్పష్టంగా ఉండడం కూడా ప్రధాన కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పరిస్థితి ఇలాగే ఉంటే కొన్ని నెలల్లోనే మరో 10 లక్షల ఉద్యోగాలు ఆటోమొబైల్ రంగంలో కోత పడవచ్చని ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య వెల్లడించింది.

ఇదంతా నాణానికి ఒకవైపు అయితే…. మరోవైపు కార్ల అమ్మకాలు తగ్గడం వల్ల దేశంలో పొల్యూషన్ తగ్గుతుందని, ట్రాఫిక్ సమస్యలు కూడా కొంతమేరకు తగ్గుతాయని, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం కూడా కొంత తగ్గుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

First Published:  16 Aug 2019 2:30 AM IST
Next Story