చిరంజీవి లుక్ పై తీవ్ర విమర్శలు
పంద్రాగస్ట్ కానుకగా సైరా సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే వీడియో బాగుంది కానీ, ఎప్పట్లానే చిరంజీవి లుక్స్ పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాలో చిరంజీవి గెటప్ బాగాలేదని, ఆ లుక్ చిరంజీవికి సెట్ కాలేదంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి. నిజానికి చిరంజీవి లుక్ పై ఈ తరహా విమర్శలు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పట్నుంచే ఇలాంటి కామెంట్స్ […]
పంద్రాగస్ట్ కానుకగా సైరా సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే వీడియో బాగుంది కానీ, ఎప్పట్లానే చిరంజీవి లుక్స్ పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాలో చిరంజీవి గెటప్ బాగాలేదని, ఆ లుక్ చిరంజీవికి సెట్ కాలేదంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి.
నిజానికి చిరంజీవి లుక్ పై ఈ తరహా విమర్శలు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పట్నుంచే ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. జులపాల జుట్టు చిరంజీవికి సెట్ కాలేదనేది ఎక్కువమంది అభిప్రాయం. అయితే సినిమాలో కేవలం చిరంజీవికి మాత్రమే పొడుగాటి హెయిర్ పెట్టలేదు. స్వతంత్రనానికి ముందు సినిమా కాబట్టి, కాస్త కొత్తగా ఉంటుందని నటులందరికీ భారీ హెయిర్ స్టయిల్స్ ప్లాన్ చేసినట్టున్నారు.
ఇందులో భాగంగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు లాంటి నటులందరికీ భుజాల వరకు వచ్చేలా జుట్టు ఏర్పాటుచేశారు. వాళ్లందరికీ అది బాగా సెట్ అయింది కూడా. కానీ చిరంజీవి వద్దకు వచ్చేసరికి మాత్రం ఈ లుక్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మేకింగ్ వీడియోలో అయితే చిరంజీవి లుక్ అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్, గ్రాఫిక్స్ అన్నీ జోడించిన తర్వాత విడుదలకానున్న టీజర్, ట్రయిలర్ లోనైనా చిరంజీవి గెటప్ ఆకట్టుకుంటుందేమో చూడాలి.