Telugu Global
NEWS

కొహ్లీ సెంచరీతో... భారత్ కే సిరీస్

మూడోవన్డేలో అలవోకగా నెగ్గిన భారత్  2-0తో వన్డే సిరీస్ భారత్ కైవసం ప్రపంచ రెండోర్యాంకర్ భారత్…కరీబియన్ టూర్ లో వరుసగా రెండోసిరీస్ గెలుచుకొంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో ముగిసిన మూడోవన్డే లో సైతం భారత్ తిరుగులేని విజయం సాధించింది. తీన్మార్ వన్డే సిరీస్ ను 2-0తో కైవసం చేసుకొంది. క్రిస్ గేల్ హాట్ హాట్… విరాట్ కూల్ కూల్… అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న ఈ కీలక ఆఖరివన్డేలో విండీస్ కు […]

కొహ్లీ సెంచరీతో... భారత్ కే సిరీస్
X
  • మూడోవన్డేలో అలవోకగా నెగ్గిన భారత్
  • 2-0తో వన్డే సిరీస్ భారత్ కైవసం

ప్రపంచ రెండోర్యాంకర్ భారత్…కరీబియన్ టూర్ లో వరుసగా రెండోసిరీస్ గెలుచుకొంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో ముగిసిన మూడోవన్డే లో సైతం భారత్ తిరుగులేని విజయం సాధించింది. తీన్మార్ వన్డే సిరీస్ ను 2-0తో కైవసం చేసుకొంది.

క్రిస్ గేల్ హాట్ హాట్… విరాట్ కూల్ కూల్…

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న ఈ కీలక ఆఖరివన్డేలో విండీస్ కు ఓపెనర్లు క్రిస్ గేల్-ఇవిన్ లూయిస్ 115 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

తన కెరియర్ లో …క్వీన్స్ పార్క్ వేదికగా విండీస్ తరపున ఆఖరి వన్డే ఆడిన గేల్…కేవలం 41 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, 5 సిక్సర్లతో సుడిగాలి హాఫ్ సెంచరీ సాధించాడు. 72 పరుగులకు ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ ఊపిరిపీల్చుకోగలిగింది.

వానదెబ్బతో సగంలో నిలిచిపోయిన ఈ మ్యాచ్ లో విండీస్ 35 ఓవర్లలో 7 వికెట్లకు 240 పరుగులు సాధించగలిగింది.
భారత బౌలర్లలో ఖలీల్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు.

కొహ్లీ-అయ్యర్ షో…

సమాధానంగా 35 ఓవర్లలో 255 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ 32.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 256 పరుగుల స్కోరుతో 6 వికెట్ల విజయం సాధించింది.

కెప్టెన్ విరాట్ కొహ్లీ 99 బాల్స్ లో 14 బౌండ్రీలతో 114, శ్రేయస్ అయ్యర్ 65 బాల్స్ లో 5సిక్సర్లు, 3 బౌండ్రీలతో 65 పరుగులు సాధించారు.

సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో టాప్ స్కోరర్ గా నిలిచిన కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

ఇప్పటికే…టీ-20, వన్డే సిరీస్ లు నెగ్గిన భారత్…ఈ నెల 22 నుంచి జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం కరీబియన్ టీమ్ పనిపట్టడానికి సిద్ధమవుతోంది.

First Published:  15 Aug 2019 1:00 AM IST
Next Story