క్వీన్స్ పార్క్ లో అయ్యారే... విరాట్ కొహ్లీ
శ్రేయస్ అయ్యర్, విరాట్ అరుదైన ఘనత విండీస్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరి రెండువన్డేలలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, యువఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన రెండు, మూడు వన్డేలలో ఈ ఇద్దరూ కీలకభాగస్వామ్యాలతో భారత్ జట్టుకు విజయాలు మాత్రమే కాదు… సిరీస్ ను సైతం అందించారు. విరాట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు… భారత కెప్టెన్ […]
- శ్రేయస్ అయ్యర్, విరాట్ అరుదైన ఘనత
విండీస్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరి రెండువన్డేలలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, యువఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన రెండు, మూడు వన్డేలలో ఈ ఇద్దరూ కీలకభాగస్వామ్యాలతో భారత్ జట్టుకు విజయాలు మాత్రమే కాదు… సిరీస్ ను సైతం అందించారు.
విరాట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు…
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ రెండో వన్డేలో మొత్తం 125 బాల్స్ ఎదుర్కొని 14 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 120 పరుగులు సాధించడం ద్వారా.. వెస్టిండీస్ ప్రత్యర్థిగా 8వ శతకం సాధించాడు.
అంతేకాదు… సిరీస్ లోని ఆఖరివన్డేలో సైతం.. విరాట్ కొహ్లీ కేవలం 99 బాల్స్ లోనే 14 బౌండ్రీలతో మెరుపు సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్లో కొహ్లీకి ఇది 43వ శతకం కావడం విశేషం.
అయ్యారే… ఏమి బ్యాటింగ్…
భారత వన్డేజట్టులో చోటు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యువఆటగాడు శ్రేయస్ అయ్యర్ …. ఆఖరి రెండు వన్డేలలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో తన సత్తా ఏపాటిదో చాటుకొన్నాడు.
రెండో వన్డేలో కొహ్లీతో కలసి కీలక భాగస్వామ్యం సాధించడం తో పాటు శ్రేయస్ అయ్యర్ 65 బాల్స్ లో 5సిక్సర్లు, 3 బౌండ్రీలతో 65 పరుగులు సాధించాడు.
ఆఖరి వన్డేలో సైతం అయ్యర్ 68 బాల్స్ లో 5 బౌండ్రీలు, 1 సిక్సర్ తో 71 పరుగులు సాధించాడు. సిరీస్ లో విరాట్ కొహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో టాప్ స్కోరర్ గా నిలిస్తే…శ్రేయస్ అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో.. కెప్టెన్ కు అండగా నిలవడం విశేషం.