Telugu Global
Cinema & Entertainment

రాహుల్ రవీంద్రన్ కవరింగ్ కూడా కాపాడలేకపోయింది

ఒకప్పుడు తెలుగులో అడల్ట్ కామెడీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించ గలిగాయి ఏమో కాని, ఈ మధ్య కాలంలో మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు కేవలం కంటెంట్ ఉన్న సినిమాలకే తమ ఓటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ వంటి కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. అయినప్పటికీ మంచి కథ ఉండి అడల్ట్ కామెడీ డైలాగులు ఉన్నా సరే సినిమాలు హిట్ అవుతున్నాయి….. కానీ ఒకరకంగా అది రిస్క్ అనే చెప్పుకోవాలి. తాజాగా […]

రాహుల్ రవీంద్రన్ కవరింగ్ కూడా కాపాడలేకపోయింది
X

ఒకప్పుడు తెలుగులో అడల్ట్ కామెడీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించ గలిగాయి ఏమో కాని, ఈ మధ్య కాలంలో మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు కేవలం కంటెంట్ ఉన్న సినిమాలకే తమ ఓటు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ వంటి కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. అయినప్పటికీ మంచి కథ ఉండి అడల్ట్ కామెడీ డైలాగులు ఉన్నా సరే సినిమాలు హిట్ అవుతున్నాయి….. కానీ ఒకరకంగా అది రిస్క్ అనే చెప్పుకోవాలి. తాజాగా ‘మన్మధుడు 2’ సినిమా మొత్తం కథ లేకుండా ఇలాంటి డైలాగుల తోనే సినిమా మొత్తం నడిపాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

నాగార్జున మరియు రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దాదాపు అన్ని డైలాగులు అలానే అనిపించాయి. ఎంత తన డైలాగులకి డబుల్ మీనింగ్ లేదు…. సింగిల్ మీనింగ్ మాత్రమే ఉంది అని… రాహుల్ రవీంద్రన్ చెప్పడానికి ప్రయత్నించినా… ప్రేక్షకులు మాత్రం సినిమా కి నెగటివ్ మార్కులే ఇస్తున్నారు.

ఒకపక్క అందులో డబుల్ మీనింగ్ ఏమీ లేదు అంటూ రాహుల్ ఎంత కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సినిమా చూసినవారికి మాత్రం ఆ మాటలు ఇంకా సినిమాని డ్యామేజ్ చేస్తున్నట్టే కనిపిస్తున్నాయి.

మొదటి సినిమా ‘చిలసౌ’ తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన రెండో సినిమాతో మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో ఏమాత్రం సఫలం అవ్వలేదని చెప్పవచ్చు.

First Published:  15 Aug 2019 4:49 AM IST
Next Story