Telugu Global
NEWS

తీన్మార్ వన్డే సిరీస్ లో నేడే ఆఖరాట

క్వీన్స్ పార్క్ వేదికగా రాత్రి 7 గంటలకు సమరం భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కు టెన్షన్ టెన్షన్ ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లు ముగిసే సమయానికి 1-0 ఆధిక్యంతో ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. ఆఖరి వన్డే సైతం నెగ్గి 2-0తో సిరీస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో […]

తీన్మార్ వన్డే సిరీస్ లో నేడే ఆఖరాట
X
  • క్వీన్స్ పార్క్ వేదికగా రాత్రి 7 గంటలకు సమరం
  • భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కు టెన్షన్ టెన్షన్

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లు ముగిసే సమయానికి 1-0 ఆధిక్యంతో ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. ఆఖరి వన్డే సైతం నెగ్గి 2-0తో సిరీస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో విరాట్ అండ్ కో ఉన్నారు.

మరోవైపు ఆతిథ్య కరీబియన్ జట్టు మాత్రం…కనీసం ఆఖరి వన్డేలో నైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

శిఖర్ ధావన్ పైనే ఒత్తిడి…

గాయం నుంచి కోలుకొని భారతజట్టులో చేరిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్ర ఒత్తిడి నడుమ బరిలోకి దిగుతున్నాడు.
తీన్మార్ టీ-20 సిరీస్ లో 1, 23, 3 పరుగుల స్కోర్లకు అవుటైన ధావన్… రెండో వన్డేలో కేవలం 2 పరుగుల స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో …ధావన్ పై వరుస వైఫల్యాల ఒత్తిడి పెరిగిపోయింది.

ఆఖరి వన్డేలోనైనా తనదైన శైలిలో ఆడి ఓ భారీ ఇన్నింగ్స్ తో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని భావిస్తున్నాడు.

మరోవైపు సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకొన్న యువఆటగాడు శ్రేయస్ అయ్యర్ ను నాలుగో నంబర్ స్థానంలో ఖాయం చేయాలన్న భావన టీమ్ మేనేజ్ మెంట్ లో బలంగా నాటుకు పోయింది.

125 బాల్స్ లో 120 పరుగులతో చెలరేగిపోయిన కెప్టెన్ కొహ్లీ…ఆఖరి వన్డేను సైతం మూడంకెల స్కోరుతోనే ముగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

విండీస్ కు డూ ఆర్ డై…

టీ-20 సిరీస్ నుంచి వన్డే సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల వరకూ… వానదెబ్బతో సతమతమైపోతున్న విండీస్ జట్టు… ఆఖరి వన్డేలో ఆరునూరైనా విజయం సాధించాలన్న కసితో ఉంది. బ్యాటింగ్ లో టాపార్డర్ పూర్తిస్థాయిలో రాణించగలిగితేనే భారత్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

ప్రధానంగా తన కెరియర్ లో ఆఖరి వన్డే ఆడుతున్న క్రిస్ గేల్ ఓ భారీ స్కోరుతో సిరీస్ ను ముగించాలని కరీబియన్ అభిమానులు కోరుతున్నారు.

రికార్డుల్లో ఢీ అంటే ఢీ….

కరీబియన్ గడ్డపై ఈ రెండుజట్లూ 38 వన్డేల్లో తలపడితే… విండీస్ 20, భారత్ 15 విజయాల రికార్డుతో నిలిచాయి. మిగిలిన మూడువన్డేలు ఫలితం తేలకుండానే రద్దుల పద్దులో చేరాయి. భారత్ పై కరీబియన్ జట్టుకు 62 శాతం, విండీస్ ప్రత్యర్థిగా భారత్ కు 58 శాతం విజయాలు ఉన్నాయి.

ఓవరాల్ గా చూస్తే ప్రస్తుత సిరీస్ లోని రెండో వన్డే వరకూ ఈ రెండు జట్లు 129 వన్డేల్లో ఫేస్ టు ఫేస్ తలపడితే… కరీబియన్ టీమ్ 63, భారత్ 61 విజయాల రికార్డుతో ఉన్నాయి.

మ్యాచ్ పూర్తి 50 ఓవర్లపాటు సాగితే.. హైస్కోరింగ్ తో ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

First Published:  14 Aug 2019 3:00 AM IST
Next Story