Telugu Global
National

అభినందన్‌కు రేపు 'వీర్ చక్ర' పురస్కారం ప్రదానం

వింగ్ కమాండర్ అభినందన్ గురించి దేశంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బాలాకోట్‌పై దాడి సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్16 యుద్ద విమానాన్ని ఫిబ్రవరి 27న వెంటాడి కూల్చేసిన అతను.. ఆ తర్వాత దారి తప్పి పాకిస్తాన్‌ భూభాగంలో దిగిపోయాడు. అతను ప్రయాణించిన మిగ్ – 21 బైసన్ విమానం.. పాక్ విమానం కంటే ఎంతో పాతది. అయినా ధైర్యంగా వెంటాడారు. పాక్ ఆర్మీకి చిక్కిన అతడిని ఆ దేశం మార్చి 1న వాఘా వద్ద విడిచి పెట్టింది. […]

అభినందన్‌కు రేపు వీర్ చక్ర పురస్కారం ప్రదానం
X

వింగ్ కమాండర్ అభినందన్ గురించి దేశంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బాలాకోట్‌పై దాడి సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్16 యుద్ద విమానాన్ని ఫిబ్రవరి 27న వెంటాడి కూల్చేసిన అతను.. ఆ తర్వాత దారి తప్పి పాకిస్తాన్‌ భూభాగంలో దిగిపోయాడు. అతను ప్రయాణించిన మిగ్ – 21 బైసన్ విమానం.. పాక్ విమానం కంటే ఎంతో పాతది. అయినా ధైర్యంగా వెంటాడారు.

పాక్ ఆర్మీకి చిక్కిన అతడిని ఆ దేశం మార్చి 1న వాఘా వద్ద విడిచి పెట్టింది. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఎంత బలవంత పెట్టినా తాను మాత్రం ఒక్క రహస్యాన్ని కూడా చెప్పలేదు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా లభించాయి. అభినందన్ ధైర్య సాహసాలకు మెచ్చి యుద్దానికి సంబంధించిన అత్యున్నత మూడో పురస్కారం అయిన వీర్ చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రేపు ఢిల్లీలో జరుగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అభినందన్‌కు ‘వీర్ చక్ర’ పురస్కారం ప్రదానం చేయనున్నారు. అతనితో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్‌ను యుద్ద సేవ అవార్డుతో సత్కరించనున్నారు.

ఇక 2018 కుల్గామ్‌ ఎన్‌కౌంటర్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన ప్రకాశ్ జాదవ్, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ హర్షపాల్ సింగ్‌లకు కీర్తి చక్ర అవార్డును ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు 14 మందికి శౌర్య చక్ర పురస్కారాలు లభించనున్నాయి.

First Published:  14 Aug 2019 5:55 AM IST
Next Story