Telugu Global
NEWS

కమలంలోకి రాములమ్మ?

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేస్తోంది. తెలుగు రాష్ట్ర్రాల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులకు కమలతీర్ధం ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయ్యిందంటున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కార్యదర్శిగా ఉన్న విజయశాంతితో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ […]

కమలంలోకి  రాములమ్మ?
X

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేస్తోంది. తెలుగు రాష్ట్ర్రాల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులకు కమలతీర్ధం ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయ్యిందంటున్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కార్యదర్శిగా ఉన్న విజయశాంతితో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తీరుపై అసమ్మతితో ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆ సందర్భంగా విజయశాంతి బీజేపిలో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు అధికార తెలంగాణ రాష్ట్ర్ర సమితిలో అసంతృప్తితో ఉన్న మరికొందరు నాయకులు కూడా బీజేపీలో చేరబోతున్నట్లుగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కూడా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. తనపట్ల పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు నిర్లక్ష్యంగా ఉన్నారని గత కొంతకాలంగా కడియం శ్రీహరి సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అలాగే జిల్లాలో తనకు బద్ద శత్రువైన ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కూడా కడియం ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు.

వీరిద్దరితో పాటు ముగ్గురు మాజీ ఎంపీలు, పది మంది వరకూ మాజీ శాసనసభ్యులు కూడా కమలతీర్ధం పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. ఇందులో అధికార తెలంగాణ రాష్ట్ర్ర సమితికి చెందిన వారితో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. వీరి చేరికకు సంబంధించి జాతీయ స్ధాయి నాయకుడొకరు సంప్రదింపులు జరుపుతున్నారని, స్థానిక నాయకత్వంతో కూడా చర్చించి ఇతర పార్టీలకు చెందిన వారిని బీజేపిలో చేర్చుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

First Published:  14 Aug 2019 1:43 AM GMT
Next Story