Telugu Global
CRIME

పనామా ఏటీఎం కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌లోని వనస్థలిపురం యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్ద మే 7వ తేదీన జరిగిన భారీ చోరీ కేసును ఎల్బీనగర్ పోలీసులు ఛేదించారు. మూడు నెలల క్రితం పనామా వద్ద ఏటీఎంలో క్యాష్ నింపడానికి వచ్చిన వ్యాన్ నుంచి 58 లక్షల రూపాయల బాక్స్‌ను దుండగులు ఎత్తుకొని వెళ్లారు. ఇది రాంజీ గ్యాంగ్ పనే అని నిర్థారణకు వచ్చిన పోలీసులు దాదాపు 3 నెలల పాటు వారిని గాలించి అరెస్టు చేశారు. మే 7న ఒక మనీ మేనేజ్‌మెంట్ […]

పనామా ఏటీఎం కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు
X

హైదరాబాద్‌లోని వనస్థలిపురం యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్ద మే 7వ తేదీన జరిగిన భారీ చోరీ కేసును ఎల్బీనగర్ పోలీసులు ఛేదించారు. మూడు నెలల క్రితం పనామా వద్ద ఏటీఎంలో క్యాష్ నింపడానికి వచ్చిన వ్యాన్ నుంచి 58 లక్షల రూపాయల బాక్స్‌ను దుండగులు ఎత్తుకొని వెళ్లారు. ఇది రాంజీ గ్యాంగ్ పనే అని నిర్థారణకు వచ్చిన పోలీసులు దాదాపు 3 నెలల పాటు వారిని గాలించి అరెస్టు చేశారు.

మే 7న ఒక మనీ మేనేజ్‌మెంట్ వ్యాన్ నగదు బాక్సులతో పనామా వద్దకు చేరుకుంది. ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ భద్రత కోసం ఉండగా.. రాంజీ ముఠా సభ్యులు అతడి దృష్టి మరల్చి ఒక నగదు బాక్సును ఎత్తుకెళ్లారు. రోడ్డుకు మరోవైపుకు వెళ్లి షేర్ ఆటోలో మూసారాంబాగ్ సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు.

ఆ సులభ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న వ్యక్తిని మాటల్లో పెట్టి లోపలకు వెళ్లి నగదును 5 బ్యాగుల్లో విడివిడిగా సర్థారు. ఆ తర్వాత అందరూ తలోవైపు వెళ్లిపోయారు. అయితే, ఈ చోరీ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని వెంబడించారు. కాని అప్పటికే వాళ్లు నగరం వదలి వెళ్లిపోయారు.

పనామా సమీపంలోని లాడ్జీల్లో చోరీకి ముందు వాళ్లు బస చేశారని తెలుసుకొని సీసీ కెమేరా ఫుటేజీని పరిశీలించి అది రాంజీ గ్యాంగ్ పనే అని గుర్తించారు. వాళ్ల కోసం తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ప్రాంతాల్లో తీవ్రంగా గాలించి ఎట్టకేలకు అరెస్టు చేశారు.

ఇవాళ మధ్యాహ్నం వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

First Published:  14 Aug 2019 6:12 AM IST
Next Story