Telugu Global
NEWS

కృష్ణా వరద బాబు ఇంటి ప్రహరీని కూడా తాకలేదు " టీడీపీ మీడియా

కరువు కాలంలో చంద్రబాబు కరకట్ట ఇంటికి ఎలాంటి ముప్పు రాలేదు. పదేళ్లుగా కృష్ణా నదికి వరద లేకపోవడంతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు భారీగా ఎగువ నుంచి కృష్ణమ్మ పోటెత్తుతోంది. దాంతో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు. బాబు ఇంటిని నది చుట్టుముట్టకుండా వేలాది ఇసుక బస్తాలను అడ్డుపెడుతున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద పరిస్థితిపై మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆర్కే… తక్షణం చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటిని నది […]

కృష్ణా వరద బాబు ఇంటి ప్రహరీని కూడా తాకలేదు  టీడీపీ మీడియా
X

కరువు కాలంలో చంద్రబాబు కరకట్ట ఇంటికి ఎలాంటి ముప్పు రాలేదు. పదేళ్లుగా కృష్ణా నదికి వరద లేకపోవడంతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు భారీగా ఎగువ నుంచి కృష్ణమ్మ పోటెత్తుతోంది. దాంతో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు. బాబు ఇంటిని నది చుట్టుముట్టకుండా వేలాది ఇసుక బస్తాలను అడ్డుపెడుతున్నారు.

చంద్రబాబు ఇంటి వద్ద పరిస్థితిపై మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆర్కే… తక్షణం చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటిని నది చుట్టుముట్టబోతోందన్నారు. అయితే వైసీపీ నేతల వాదనను టీడీపీ మీడియా తోసి పుచ్చింది. చంద్రబాబు ఇంటిని కృష్ణా నది చుట్టుముడుతోందన్న వార్తలను టీడీపీ చానల్‌ ఖండించింది.

చంద్రబాబు ఇంటి ప్రహరీ గోడను కూడా నది తాకలేకపోతోందని…. గ్రౌండ్ రిపోర్ట్ అంటూ వివరించింది. మంత్రులు చెబుతున్నట్టుగా చంద్రబాబు ఇంటి వద్ద వరద ప్రమాదం ఏమీ లేదని ఆ చానల్ వివరించింది. అయితే సదరు చానల్ ఈ అంశంపై రిపోర్టు అందిస్తున్న సమయంలో అక్కడ ట్రాక్టర్లతో ఇసుక తరలింపు, అక్కడ ఉన్న జేసీబీ దృశ్యాలు కనిపించాయి.

అన్ని ట్రాక్టర్లతో ఇసుక ఎందుకు తెస్తున్నారు?, దాన్ని బస్తాల్లో నింపి ఎందుకు అడ్డుగా పెడుతున్నారు? అన్న అంశాన్ని మాత్రం సదరు చానల్ వివరించలేదు. కృష్ణా నది ప్రవాహం 8లక్షల క్యూసెక్కులు వచ్చే వరకు ముంపు వార్తలను టీడీపీ వర్గాలు అంగీకరించేలా కనిపించడం లేదు.

First Published:  14 Aug 2019 2:06 PM IST
Next Story