Telugu Global
Cinema & Entertainment

ఇంత రన్ టైమ్ అవసరమా సాహో!

భారీ సినిమాలకు రన్ టైమ్ బాగా పెరిగిపోతోంది ఈమధ్య. సినిమాపై ఉన్న ప్రేమతో ఎడిటర్ ను కట్టడి చేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఫలానా సన్నివేశానికి భారీగా ఖర్చు పెట్టామంటూ నిర్మాతలు, ఫలానా సీన్ కోసం చాలా కష్టపడ్డానంటూ దర్శకులు.. తమ ఇష్టం కొద్దీ ఎడిటర్ చేతులు కట్టేస్తున్నారు. ఫలితంగా సినిమా నిడివి పెరిగిపోతోంది. ఇప్పుడు సాహో విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిడివి అక్షరాలా 2 […]

ఇంత రన్ టైమ్ అవసరమా సాహో!
X

భారీ సినిమాలకు రన్ టైమ్ బాగా పెరిగిపోతోంది ఈమధ్య. సినిమాపై ఉన్న ప్రేమతో ఎడిటర్ ను కట్టడి చేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఫలానా సన్నివేశానికి భారీగా ఖర్చు పెట్టామంటూ నిర్మాతలు, ఫలానా సీన్ కోసం చాలా కష్టపడ్డానంటూ దర్శకులు.. తమ ఇష్టం కొద్దీ ఎడిటర్ చేతులు కట్టేస్తున్నారు. ఫలితంగా సినిమా నిడివి పెరిగిపోతోంది. ఇప్పుడు సాహో విషయంలో కూడా అదే జరుగుతోంది.

ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిడివి అక్షరాలా 2 గంటల 52 నిమిషాలు ఉంది. పొగ తాగొద్దంటూ వచ్చే యాడ్స్, కృతజ్ఞతలు తెలిపే స్లైడ్స్ కూడా కలుపుకుంటే డ్యూరేషన్ 3 గంటలు. తెలుగులో ప్రభాస్ కోసం ఇంత రన్ టైమ్ ను ప్రేక్షకులు భరిస్తారు. మరి ఇదే రన్ టైమ్ బాలీవుడ్ లో వర్కవుట్ అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

తెలుగులో ఈమధ్య పెద్ద సినిమాలన్నీ కాస్త ఎక్కువ రన్ టైమ్ తోనే వస్తున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల నిడివి కాస్త ఎక్కువే. మహానటి నిడివి కూడా ఎక్కువే. అవన్నీ హిట్ అయ్యాయి… కాబట్టి సాహో రన్ టైమ్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదని మేకర్స్ భావిస్తున్నారు. కానీ ఇప్పటికే సినిమా చూసిన వాళ్లు మాత్రం సాహోకు కాస్త కోతపెడితే బాగుంటుందని భావిస్తున్నారు.

ఈ విషయంలో రాజమౌళి, దిల్ రాజు లాంటి వ్యక్తుల సలహాలు తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈరోజు లేదా రేపు ఈ సినిమాను వాళ్లకు చూపించి ఫైనల్ రన్ టైమ్ ను లాక్ చేస్తారు. ఆ తర్వాత సెన్సార్ కు వెళ్తారు.

First Published:  14 Aug 2019 3:03 PM IST
Next Story