Telugu Global
NEWS

ద్రావిడ్ కు క్రికెట్ పాలకమండలి క్లీన్ చిట్

పరస్పర విరుద్ధ ప్రయోజనం లేదంటూ గ్రీన్ సిగ్నల్ భారత మాజీ కెప్టెన్, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ కు క్రికెట్ పాలకమండలి క్లీన్ చిట్ ఇచ్చింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా ద్రావిడ్ నియామకాన్ని ఆమోదం తెలిపింది. ఇక… తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ మాత్రమేనని క్రికెట్ పాలకమండలి సభ్యుడు లెఫ్ట్ నెంట్ జనరల్ రవి తోగ్డే ప్రకటించారు. ఇండియా సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూనే.. జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా […]

ద్రావిడ్ కు క్రికెట్ పాలకమండలి క్లీన్ చిట్
X
  • పరస్పర విరుద్ధ ప్రయోజనం లేదంటూ గ్రీన్ సిగ్నల్

భారత మాజీ కెప్టెన్, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ కు క్రికెట్ పాలకమండలి క్లీన్ చిట్ ఇచ్చింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా ద్రావిడ్ నియామకాన్ని ఆమోదం తెలిపింది. ఇక… తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ మాత్రమేనని క్రికెట్ పాలకమండలి సభ్యుడు లెఫ్ట్ నెంట్ జనరల్ రవి తోగ్డే ప్రకటించారు.

ఇండియా సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూనే.. జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా ద్రావిడ్ బాధ్యతలు చేపట్టడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. దీంతో ..బీసీసీఐ ఎథిక్స్ అధికారి వివరణ కోరుతూ.. ద్రావిడ్ కు నోటీసు పంపారు.

ద్రావిడ్ లాంటి నిఖార్సయిన క్రికెట్ దిగ్గజానికి నోటీసు పంపుతారా? అంటూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ ను ఇక ఆ దేవుడే కాపాడాలంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

ఈ వివాదంపై.. వినోద్ రాయ్ నేతృత్వంలోని భారత క్రికెట్ పాలకమండలి విచారణ జరిపి…త మకు ఎలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనం కన్పించలేదంటూ స్పష్టం చేసింది. దీనిపై తుదినిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐకి చెందిన ఆంబుడ్స్ మన్ మాత్రమేనని ప్రకటించింది.

మరోవైపు ద్రావిడ్ సైతం తన వివరణను బీసీసీఐకి పంపడం ద్వారా తన హుందాతనాన్ని మరోసారి చాటుకొన్నాడు.

ఇండియా సిమెంట్స్ యాజమాన్యం నుంచి తాను ఎలాంటి ప్రతిఫలమూ పొందకుండా… సెలవులో ఉంటూ జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ద్రావిడ్ వివరణ ఇచ్చాడు.

First Published:  14 Aug 2019 7:10 AM IST
Next Story