Telugu Global
National

డాక్టర్‌ను కొడితే పదేళ్లు... ఆస్పత్రిపై దాడి చేస్తే ఐదేళ్లు జైలు

డాక్టర్లపై, ఆస్పత్రులపై దాడులను నిరోధించేందుకు కేంద్రం కొత్త చట్టం తెస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. బిల్లు చట్టం రూపం దాలిస్తే… డ్యూటీలో ఉన్న వైద్యుడిపై దాడి చేసిన వారు కటకటాలపాలవక తప్పదు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై దాడి చేసి గాయపరిస్తే అందుకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొస్తున్నారు. పదేళ్ల జైలుతో పాటు 10 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఇక ఆస్పత్రిపై మూకుమ్మడిగా దాడి చేసి […]

డాక్టర్‌ను కొడితే పదేళ్లు... ఆస్పత్రిపై దాడి చేస్తే ఐదేళ్లు జైలు
X

డాక్టర్లపై, ఆస్పత్రులపై దాడులను నిరోధించేందుకు కేంద్రం కొత్త చట్టం తెస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. బిల్లు చట్టం రూపం దాలిస్తే… డ్యూటీలో ఉన్న వైద్యుడిపై దాడి చేసిన వారు కటకటాలపాలవక తప్పదు.

డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై దాడి చేసి గాయపరిస్తే అందుకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొస్తున్నారు. పదేళ్ల జైలుతో పాటు 10 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఇక ఆస్పత్రిపై మూకుమ్మడిగా దాడి చేసి విధ్యంసానికి పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు.

ఈ రక్షణ కేవలం వైద్యులకే కాకుండా ఆరోగ్య సంరక్షణ అధికారులకు, ఇతర హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు వర్తిస్తుంది. ఈ ముసాయిదా బిల్లును ఆన్‌లైన్లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని… ఆ తర్వాత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. వైద్య సిబ్బంది తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడాన్ని కూడా ఇకపై క్రిమినల్ నేరంగా మారుస్తున్నట్టు వివరించారు.

First Published:  14 Aug 2019 5:18 AM IST
Next Story