Telugu Global
NEWS

రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది

ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు నిండుతున్నాయని, ఇది చూసిన రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్ చేశారు. “ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో రైతుల కళ్లల్లో ఆనందం కనబడుతోంది” అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని రైతులు అనేక ఇక్కట్ల పాలయ్యారని, […]

రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది
X

ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు నిండుతున్నాయని, ఇది చూసిన రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్ చేశారు.

“ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో రైతుల కళ్లల్లో ఆనందం కనబడుతోంది” అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని రైతులు అనేక ఇక్కట్ల పాలయ్యారని, ఇప్పుడు వారికి మంచి రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

కృష్ణా, గోదావరి నదులు పొంగి పొర్లుతున్నాయని, వాటి కింద ఉన్న ఆయకట్టు రైతులకు ఇక ముందు అన్నీమంచి రోజులేనని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు నిండుతున్నాయని, తాగు, సాగు నీటి కోసం ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు.

చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని, గత ప్రభుత్వం రైతులకు సరైన సమయానికి విత్తనాలు కూడా సరఫరా చేయలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గడచిన ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలనను చూసిన ప్రకృతి కూడా రైతులకు సహకరించలేదని అన్నారు.

“ఇప్పుడు రాష్ట్రంలో రైతు ప్రభుత్వం వచ్చింది. ప్రకృతి పులకరించడమే కాదు సహకరిస్తోంది” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతులకు ఇక ముందు ఉన్నవి మంచి రోజులేనని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీటి కష్టాలు తీరినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

First Published:  13 Aug 2019 6:11 AM IST
Next Story