జగన్ స్పీడ్ ని మంత్రులు అందుకోలేక పోతున్నారా?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ ని ఆ పార్టీ మంత్రులు, నాయకులు అందుకో లేక పోతున్నారా? పరిస్థితి చూస్తుంటే ఇదే నిజమేమో అనిపిస్తుంది. గత ప్రభుత్వం కంటే తాము మెరుగ్గా ఏం చేస్తున్నామో ప్రజలకు వివరించే విషయంలో మంత్రులు బాగా వెనకబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, వాటిని తీసుకోవడానికి గల కారణాలను వివరించడంలో మంత్రులు విఫలమవుతున్నారని కొందరు అంటున్నారు. ఇటీవల మహిళా బిల్లు, 50 శాతం రిజర్వేషన్ […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ ని ఆ పార్టీ మంత్రులు, నాయకులు అందుకో లేక పోతున్నారా? పరిస్థితి చూస్తుంటే ఇదే నిజమేమో అనిపిస్తుంది.
గత ప్రభుత్వం కంటే తాము మెరుగ్గా ఏం చేస్తున్నామో ప్రజలకు వివరించే విషయంలో మంత్రులు బాగా వెనకబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, వాటిని తీసుకోవడానికి గల కారణాలను వివరించడంలో మంత్రులు విఫలమవుతున్నారని కొందరు అంటున్నారు.
ఇటీవల మహిళా బిల్లు, 50 శాతం రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిల్లు ఇలా 19 బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ఆమోదింప చేసుకుంది. అయితే ఈ బిల్లుల అంతరార్థాన్ని అనుకున్నంతగా ప్రజల వద్దకు తీసుకుపోవడంలో మంత్రులు బాగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు.
అట్లాగే ఎవరో ఒకరిద్దరు మంత్రులు తప్ప…. ప్రతిపక్ష నాయకుల విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టలేని పరిస్థితుల్లో చాలా మంది మంత్రులు ఉన్నారు.
ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవడంలో కొందరు మంత్రులు విఫలమయ్యారని ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఇదే విషయంపై రాజమండ్రిలో సమీక్ష నిర్వహించిన జగన్ మంత్రులకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను వేగంగా అందిపుచ్చుకోవడంలో మొత్తం మీద మంత్రులు వెనుకబడిపోతున్నారనేది స్పష్టమవుతోంది. పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వ ఇమేజ్ దెబ్బ తినటం ఖాయం. మరి జగన్ ఈ పరిస్థితిని ఎట్లా చక్కదిదిద్దుతారో వేచి చూడాలి.