పట్టిసీమ, పురుషోత్తపట్నం ఆపేయాలని తీర్పు
ఏపీలో నిర్మితమైన, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. నాలుగు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాల్సిందిగా ఆదేశించింది. పర్యావరణ అనుమతుల్లేని నాలుగు ఎత్తిపోతల పథకాలను తక్షణం ఆపేయాలని తీర్పు చెప్పింది. గోదావరి- పెన్నా అనుసంధానం, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలని ఆదేశించింది. ఈ నాలుగు ప్రాజెక్టులకు తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే ఆయా ప్రాజెక్టులను నడపాలని ఎన్‌జీటీ స్పష్టం […]

ఏపీలో నిర్మితమైన, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. నాలుగు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాల్సిందిగా ఆదేశించింది. పర్యావరణ అనుమతుల్లేని నాలుగు ఎత్తిపోతల పథకాలను తక్షణం ఆపేయాలని తీర్పు చెప్పింది.
గోదావరి- పెన్నా అనుసంధానం, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలని ఆదేశించింది. ఈ నాలుగు ప్రాజెక్టులకు తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే ఆయా ప్రాజెక్టులను నడపాలని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.
టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఏకపక్షంగా పురుషోత్తపట్నం, పట్టిసీమ నిర్మాణానికి పూనుకోవడంపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎలాంటి అనుమతులు లేకుండానే టీడీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను చేపడుతోందని గతంలో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్, త్రినాథ్‌లు ఎన్‌జీటీలో పిటిషన్ వేశారు.