గుడ్డు చేతిలో పెట్టి పిల్లను అడుగుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నెటిజన్లే కాదు సామాన్యులు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనను తన వ్యాఖ్యలతో ఎండగడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఐదేళ్లు ఏలిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు మిగిల్చి వెళ్లిపోయారని మండిపడుతున్నారు. మంగళవారం ఓ ఛానల్ నిర్వహించిన చర్చాగోష్ఠిలో టెలిఫోన్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పిన సామాన్యులు “ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలన తర్వాత గుడ్డు చేతిలో పెట్టి పిల్లను ఇవ్వండని నూతన ప్రభుత్వాన్ని అడుగుతున్నారు” […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నెటిజన్లే కాదు సామాన్యులు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనను తన వ్యాఖ్యలతో ఎండగడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఐదేళ్లు ఏలిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు మిగిల్చి వెళ్లిపోయారని మండిపడుతున్నారు.
మంగళవారం ఓ ఛానల్ నిర్వహించిన చర్చాగోష్ఠిలో టెలిఫోన్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పిన సామాన్యులు “ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలన తర్వాత గుడ్డు చేతిలో పెట్టి పిల్లను ఇవ్వండని నూతన ప్రభుత్వాన్ని అడుగుతున్నారు” అని చర్చా గోష్ఠిలో నెల్లూరు నుంచి టెలిఫోన్ లో తన అభిప్రాయాలను చెప్పిన వ్యక్తి వ్యాఖ్యానించారు.
అప్పులు మిగిల్చిన చంద్రబాబు నాయుడు రెండు నెలల జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా తన పాత రాజకీయాలను, మూస ధోరణిని వదలలేదని చెన్నై నుంచి టెలిఫోన్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు టీ.వీ.రావు. “అయ్యా చంద్రబాబు గారు మీరు మారాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటున్న మీరు అప్ డేట్ కావాలి. సోషల్ మీడియా రోజు రోజుకు విస్తరిస్తోంది. మీరు గతంలో చేసిన రాజకీయాలు నేడు చెల్లుబాటు కావు” అని టి.వి. రావు చంద్రబాబుకు హితవు పలికారు.
ఆంధ్ర్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడాన్ని చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టెలిఫోన్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు పాండురంగరాజు.
ఈ చర్చా గోష్ఠిలో నేరుగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకున్నారని అన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని చెప్పారని, అలాగే చేస్తున్నారని ధర్మశ్రీ పేర్కొన్నారు.
చర్చా గోష్ఠిలో పాల్గొన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వాస్తవాలను చెప్పాలని, తప్పుడు ప్రచారం చేయకూడదంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 19 బిల్లులు ప్రవేశ పెడితే చంద్రబాబు నాయుడు ఒక్క అంశంపై కూడా చర్చకు రాలేదని మండిపడ్డారు.