Telugu Global
NEWS

కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోతాయి : బీజేపీ జోస్యం

తెలంగాణలో ఉప్పు, నిప్పులా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికార తెలంగాణ రాష్ట్ర్ర సమితి కలిసిపోతాయా..? ఒకరిని ఒకరు రాష్ట్రంలో లేకుండానే చేయాలనుకుంటున్నఆ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమేనా…? అవుననే అంటున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసిపోయేందుకు కూడా సిద్ధపడతాయని డాక్టర్ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఆదివారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి, […]

కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోతాయి : బీజేపీ జోస్యం
X

తెలంగాణలో ఉప్పు, నిప్పులా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికార తెలంగాణ రాష్ట్ర్ర సమితి కలిసిపోతాయా..? ఒకరిని ఒకరు రాష్ట్రంలో లేకుండానే చేయాలనుకుంటున్నఆ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమేనా…? అవుననే అంటున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసిపోయేందుకు కూడా సిద్ధపడతాయని డాక్టర్ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఆదివారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్వర్యంలో టీఆర్ఎస్ మాజీ నేత జీ.వినోద్ వెంకటస్వామి కమలతీర్ధం పుచ్చుకున్న సంగతి విదితమే.

సోమవారం నాడు వినోద్ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయానికి వచ్చి ఇక్కడి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నూ, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను, పలువురు సీనియర్ నాయకులను కలిసారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోను, బీజేపీ కార్యకర్తల సమావేశంలోను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు.

ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ తో దోస్తీ కట్టిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర్ర సమితి మజ్లీస్ తో కలిసి అడుగులు వేస్తోందని అన్నారు. “తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలవడం ఖాయం. వారికి జతగా మజ్లీస్ కూడా చేతులు కలుపుతుంది” అని లక్ష్మణ్ అన్నారు.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, దీనిని గమనిస్తున్నఇతర పార్టీలకు చెందిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన నాయకులు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు.

వినోద్ రాకతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుందనే నమ్మకం తమకు ఉందని, ఆయన వల్ల పార్టీకి, బడుగు, బలహీన వర్గాల వారికి మేలు జరుగుతుందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

First Published:  12 Aug 2019 8:31 PM GMT
Next Story