Telugu Global
NEWS

ఇంకా ఖాళీ కాని సీటు కోసం...

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గా టి ఆర్ ఎస్ తరఫున భూపతి రెడ్డి గెలిచారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి తో విభేదాల కారణంగా ఆయన పై అసంతృప్త నేత అనే ముద్ర పడింది. గులాబీ నేతలతో ఉన్న విభేదాల కారణంగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు భూపతి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బాజిరెడ్డి పై పోటీచేసి గట్టి పోటీని ఇచ్చారు కూడా. అయితే భూపతి రెడ్డి ని […]

ఇంకా ఖాళీ కాని సీటు కోసం...
X

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గా టి ఆర్ ఎస్ తరఫున భూపతి రెడ్డి గెలిచారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి తో విభేదాల కారణంగా ఆయన పై అసంతృప్త నేత అనే ముద్ర పడింది. గులాబీ నేతలతో ఉన్న విభేదాల కారణంగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు భూపతి.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బాజిరెడ్డి పై పోటీచేసి గట్టి పోటీని ఇచ్చారు కూడా. అయితే భూపతి రెడ్డి ని ఎమ్మెల్సీ గా డిస్ క్వాలిఫై చేయాలని టిఆర్ఎస్ నాయకులు గట్టిగా కోరారు. దీంతో భూపతి రెడ్డి పై అనర్హత వేటు పడింది. భూపతి రెడ్డి న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.

అయితే సుప్రీం తీర్పు ఎలా వస్తుందో తెలియదు కానీ, నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు నాయకులు మాత్రం భూపతి రెడ్డి ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు అవుతుందని, తిరిగి ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు తమకే కెసిఆర్ అవకాశం ఇస్తారని గంపెడు ఆశతో ఉన్నారు.

అందులో మొదటి నాయకుడు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అయితే, రెండో నాయకుడు టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన అరికెల నరసయ్య అని అంటున్నారు.

సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చినట్లయితే క్యాబినెట్ విస్తరణ లో కూడా తనకు చోటు ఉంటుందని సురేష్ రెడ్డి భావిస్తున్నారట. తన మనసులోని మాటను ఇప్పటికే పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేశారని కూడా అంటున్నారు.

ఇదేవిధంగా అరికెల కూడా అనుకుంటున్నారట. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపినందువల్లనే గులాబీ పార్టీలోకి వచ్చాడని ఒక ప్రచారం ఉంది. ఆయనకు ఎమ్మెల్సీగా అనుభవం ఉండటంతో ఈసారి తనకే కెసిఆర్ అవకాశం ఇస్తారని నమ్మకంతో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్న ఈ కేసు ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు… కానీ ఈ ఇద్దరు ఆశావహులు మాత్రం ఎంతో ఆశతో ఆ సీటు కోసం ఎదురుచూస్తున్నారు.

First Published:  13 Aug 2019 5:00 AM IST
Next Story