ఉప రాష్ట్రపతిగా పంపుతున్నారని తెలిసి.... కన్నీరు ఆగలేదు...
ఉప రాష్ట్రపతి పదవిపై తన అయిష్టతను వెంకయ్యనాయుడు మరోసారి బయటపెట్టారు. రాజకీయంగా చక్రం తిప్పాలని భావించే వెంకయ్యనాయుడిని మోడీ, అమిత్ షాలు కావాలనే ఉప రాష్ట్రపతిగా పంపించి చేతులు కట్టేశారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. వెంకయ్యనాయుడు కూడా ఉప రాష్ట్రపతిగా తనను ఎంపిక చేయడానికి ముందు రోజు వరకు కూడా తాను ఉషాపతినే గానీ, ఉప రాష్ట్రపతిని కాను అంటూ చెబుతూ వచ్చారు. కానీ మోడీ, షా ఎత్తుకు వెంకయ్యనాయుడు తలూపక తప్పలేదు. వెంకయ్యనాయుడిని క్రియాశీల రాజకీయాలను […]
ఉప రాష్ట్రపతి పదవిపై తన అయిష్టతను వెంకయ్యనాయుడు మరోసారి బయటపెట్టారు. రాజకీయంగా చక్రం తిప్పాలని భావించే వెంకయ్యనాయుడిని మోడీ, అమిత్ షాలు కావాలనే ఉప రాష్ట్రపతిగా పంపించి చేతులు కట్టేశారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి.
వెంకయ్యనాయుడు కూడా ఉప రాష్ట్రపతిగా తనను ఎంపిక చేయడానికి ముందు రోజు వరకు కూడా తాను ఉషాపతినే గానీ, ఉప రాష్ట్రపతిని కాను అంటూ చెబుతూ వచ్చారు. కానీ మోడీ, షా ఎత్తుకు వెంకయ్యనాయుడు తలూపక తప్పలేదు. వెంకయ్యనాయుడిని క్రియాశీల రాజకీయాలను నుంచి తప్పించడం వల్ల ఇటు చంద్రబాబుకు కూడా కేంద్రంలో ఏం జరుగుతుందో అంతుచిక్కని అయోమయ పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఆదివారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు… తాను ఉప రాష్ట్రపతి కావాలని ఎన్నడూ అనుకోలేదన్నారు. అయితే తనను అనూహ్యంగా వీపీని చేశారన్నారు. ఇకపై పార్టీ ఆఫీస్‌కు రావడం, కార్యకర్తలను కలుసుకోవడం సాధ్యం కాదన్న ఆలోచనతో ఆ రోజు తనకు కన్నీరు ఆగలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు బీజేపీ… ఒక్క ప్రధాని పదవి తప్ప అన్నీ ఇచ్చిందన్నారు.