Telugu Global
NEWS

శ్రీశైలం వద్ద రికార్డు ఇన్‌ఫ్లో... బాబు జీవో సవరణకు సీమ రైతుల డిమాండ్

కృష్ణ నదికి వరద తగ్గడం లేదు. పైగా అమాంతం పెరుగుతోంది. రాయలసీమ ప్రాంతంలో వరుణుడు ముఖం చాటేసినా ఎగువ నుంచి వస్తున్న భారీ వరద భారీగా ఉంది. తుంగభద్ర నది వరద కూడా వచ్చి చేరడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం 8లక్షల 54వేల క్కూసెక్కులకు చేరింది. 2009 తర్వాత ఇదే రికార్డు స్థాయి ఇన్‌ఫ్లో. శ్రీశైలం డ్యాంకు జూరాల నుంచి 8.54 లక్షల క్కూసెక్కుల నీరు వస్తుండంగా డ్యాం భద్రత దృష్టా నీటి మట్టాన్ని 879 అడుగులుగా […]

శ్రీశైలం వద్ద రికార్డు ఇన్‌ఫ్లో... బాబు జీవో సవరణకు సీమ రైతుల డిమాండ్
X

కృష్ణ నదికి వరద తగ్గడం లేదు. పైగా అమాంతం పెరుగుతోంది. రాయలసీమ ప్రాంతంలో వరుణుడు ముఖం చాటేసినా ఎగువ నుంచి వస్తున్న భారీ వరద భారీగా ఉంది. తుంగభద్ర నది వరద కూడా వచ్చి చేరడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం 8లక్షల 54వేల క్కూసెక్కులకు చేరింది. 2009 తర్వాత ఇదే రికార్డు స్థాయి ఇన్‌ఫ్లో.

శ్రీశైలం డ్యాంకు జూరాల నుంచి 8.54 లక్షల క్కూసెక్కుల నీరు వస్తుండంగా డ్యాం భద్రత దృష్టా నీటి మట్టాన్ని 879 అడుగులుగా ఉంచి సాగర్‌కు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జుసాగర్‌కు 8 లక్షల 87వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ప్రవాహం ఇలాగే ఉంటే మూడు రోజుల్లోనే నాగార్జున సాగర్‌ కూడా నిండిపోనుంది. ఇంకా ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ఈసారి కృష్ణా జలాలు సముద్రాన్ని తాకే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారానికి శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో 11 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వరద ఇలా భారీగా వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం డ్యాం భద్రత దృష్ణ్యా ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లోను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే శ్రీశైలంకు ఇంత భారీ స్థాయిలో వరద వస్తున్నా… రాయలసీమ ప్రాంతానికి సరైన రీతిలో నీటిని విడుదల చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

కాలువ సామర్థ్యం పేరుతో పూర్తి స్థాయిలో సీమ వైపు నీటిని వదలడం లేదని ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే నీరు సముద్రం వైపు వెళ్తుంటే నీరు అందించలేని పరిస్థితిల్లో… ఇక గోదావరి- కృష్ణను అనుసంధానం చేసినా రాయలసీమకు లాభమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని చంద్రబాబు తన హయాంలో 834 అడుగులకు తగ్గించి రాయలసీమ ప్రాంతాన్ని ఉరి తీశారని… తిరిగి కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు పునరుద్దరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రపంచబ్యాంకు రుణం పేరుతో, విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టాన్ని854 అడుగుల నుంచి 834 అడుగులకు తగ్గిస్తూ 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవో 69 తీసుకొచ్చారు. అది రాయలసీమకు ఇబ్బందిగా మారింది. శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీరు అందాలంటే కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉండాలి.

First Published:  12 Aug 2019 2:39 AM IST
Next Story