నన్నపనేని... కమలం వైపే!
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కమల తీర్దం పుచ్చుకోనున్నారా…? నన్నపనేని రాజకుమారిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ కూడా సంసిద్దత వ్యక్తం చేసిందా..? అంటే అవుననే అంటున్నాయి కమల వర్గాలు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామ చేసిన నన్నపనేని రాజకుమారితో బిజేపీ నాయకురాలు పురంధ్రీశ్వరి చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే ఇటీవల పొగాకు బోర్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు […]
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కమల తీర్దం పుచ్చుకోనున్నారా…? నన్నపనేని రాజకుమారిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ కూడా సంసిద్దత వ్యక్తం చేసిందా..? అంటే అవుననే అంటున్నాయి కమల వర్గాలు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామ చేసిన నన్నపనేని రాజకుమారితో బిజేపీ నాయకురాలు పురంధ్రీశ్వరి చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే ఇటీవల పొగాకు బోర్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన యడ్లపాటి రఘనాథ్ బాబు కూడా నన్నపనేని రాజకుమారితో పార్టీలో చేరిక పై చర్చించినట్లు సమాచారం.
పొగాకు బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన యడ్లపాటిని…. నన్నపనేని రాజకుమారి ఆమె భర్తతో కలిసి అభినందించారు. ఆ సమయంలో నన్నపనేని చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
చైర్ పర్సన్ గా రాజీనామ చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ ను కలిసారు నన్నపనేని. ఆ సమయంలో కమిషన్ చైర్ పర్సన్ గా ఆమె పనితీరును గవర్నర్ ప్రశంసించారు.
“ఇంత బాగా పనిచేసారుగా… ఎందుకు రాజీనామ చేస్తున్నారు?” అని గవర్నర్ నన్నపనేనితో అన్నారట. తాను అధికార పార్టీ సభ్యురాలను కానని, అందుకే రాజీనామ చేసానని నన్నపనేని బదులిచ్చారట. ఆ సమయంలోనే పార్టీ మార్పుపై వారిద్దరి మధ్య కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
నన్నపనేని భారతీయ జనతా పార్టీలో చేరడం వెనుక గవర్నర్ పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.