Telugu Global
NEWS

రోజా ఇంటికి కేసీఆర్.... కారణం అదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన పర్యటనలు చేస్తున్నారు. ఆదివారం నాడు ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ సినిమా తీస్తే తాను నిర్మాతగా ఉంటానని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఇది అటు సినీ వర్గాలలోను, ఇటు రాజకీయ వర్గాలలోను సంచలనం అయ్యింది. ఈ వార్త మరచిపోకముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ అది ఏమిటని అనుకుంటున్నారా…!? సినీనటి, నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే […]

రోజా ఇంటికి కేసీఆర్.... కారణం అదేనా?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన పర్యటనలు చేస్తున్నారు. ఆదివారం నాడు ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ సినిమా తీస్తే తాను నిర్మాతగా ఉంటానని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఇది అటు సినీ వర్గాలలోను, ఇటు రాజకీయ వర్గాలలోను సంచలనం అయ్యింది.

ఈ వార్త మరచిపోకముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ అది ఏమిటని అనుకుంటున్నారా…!? సినీనటి, నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లడమే. సోమవారం నాడు తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కంచి లోని అత్తి వరదరాజ పెరుమాళ్ ను దర్శించుకునేందుకు కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని కూడా కేసీఆర్ దర్శించుకుంటారు.

దీంతో రేణిగుంట వరకూ ప్రత్యేక విమానంలో వెళ్తారు కేసీఆర్. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తమిళనాడు చేరుకుంటారు. మధ్యలో నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుంటారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్న భోజనం కూడా ఎమ్మెల్యే రోజా ఇంటిలోనే చేస్తారని ముఖ్యమంత్రి వర్గాలు తెలిపాయి.

తెలంగాణ ముఖ్యమంత్రికి అల్పాహారంతో పాటు మధ్యాహ్నం విందును కూడా ఎమ్మెల్యే రోజా ఇస్తుండడం విశేషం. ఇందుకోసం ఎమ్మెల్యే రోజా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నగరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మంత్రులు స్వాగతం పలకనున్నారు.

ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ ను కలసిన కేసీఆర్ ఆయన దర్శకత్వం వహిస్తే తాను చిత్రాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో కాని, మరో ప్రాధాన్యం ఉన్న పాత్రలో కాని రోజాను నటించమని కేసీఆర్ అడిగే అవకాశాలు ఉన్నాయా? అని సినీ, రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

First Published:  12 Aug 2019 4:18 AM IST
Next Story