కొత్త ట్రక్కులు కొనొద్దు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల సరుకు రవాణా ట్రాన్స్‌పోర్టులు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు రంగంలో మంచి వాతావరణాన్ని దెబ్బతీసిందని సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. ప్రస్తుతం వ్యాపారం ఏమంతా లాభసాటిగా లేదని.. కాబట్టి కొత్తగా ట్రక్కులు కొనుగోలు చేయవద్దని సంఘం సభ్యులకు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం, అభిల భారత రవాణా కాంగ్రెస్‌లు సూచించాయి. ఇప్పటికే వసూలు చేస్తున్న జీఎస్‌టీతో పాటు ఇటీవల బడ్జెట్‌లో డిజీల్‌పై రెండు రూపాయల సెస్, భవిష్యత్తు ఆదాయ […]
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల సరుకు రవాణా ట్రాన్స్‌పోర్టులు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు రంగంలో మంచి వాతావరణాన్ని దెబ్బతీసిందని సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. ప్రస్తుతం వ్యాపారం ఏమంతా లాభసాటిగా లేదని.. కాబట్టి కొత్తగా ట్రక్కులు కొనుగోలు చేయవద్దని సంఘం సభ్యులకు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం, అభిల భారత రవాణా కాంగ్రెస్‌లు సూచించాయి.
ఇప్పటికే వసూలు చేస్తున్న జీఎస్‌టీతో పాటు ఇటీవల బడ్జెట్‌లో డిజీల్‌పై రెండు రూపాయల సెస్, భవిష్యత్తు ఆదాయ అంచనాలపై చెల్లించాల్సిన పన్ను పెంపు, బీమా ప్రిమియం వంటివి పెంచడం ద్వారా రవాణా రంగాన్ని కేంద్రం దారుణంగా దెబ్బతీసిందని సంఘాలు విమర్శించాయి.
ఇప్పటికే చాలా మంది వాహనాలకు రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితి వచ్చిందని… పరిస్థితి రవాణా వాణిజ్యానికి అనుకూలంగా లేదని కాబట్టి కొత్త వాహనాలు కొనుగోలు వద్దని రవాణా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహేంద్ర ఆర్య సూచించారు.
సిగరెట్లు, పాన్ మసాలా, లగ్జరీ కార్లతో సమానంగా ఎంతో అత్యవసరమైన రవాణా వాహనాలపైనా 28 శాతం జీఎస్‌టీ విధించడం ఎంత వరకు సమంజసమని అభిల భారత రవాణా సంక్షేమ సంఘం ప్రశ్నించింది. వచ్చే ఆదాయంలో 60 శాతం డిజిల్‌కే పోతోందని వివరించింది.