వైసీపీ ఎమ్మెల్యేపైనే కేసు నమోదు
టీడీపీ హయాంలో అధికార పార్టీ కార్యకర్తలు పోలీసుల కాలర్ పట్టుకున్నా కేసులుండేవి కావు. ఇక ఎమ్మెల్యేల సంగతి సరేసరి. చివరకు వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టినా కేసులు లేవు. టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయరన్న నిర్ధారణకు వచ్చిన జనం వారిపై ఫిర్యాదులు కూడా చేసేవారు కాదు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలపైనా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితులైనప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేల పైనా కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు […]
టీడీపీ హయాంలో అధికార పార్టీ కార్యకర్తలు పోలీసుల కాలర్ పట్టుకున్నా కేసులుండేవి కావు. ఇక ఎమ్మెల్యేల సంగతి సరేసరి. చివరకు వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టినా కేసులు లేవు. టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయరన్న నిర్ధారణకు వచ్చిన జనం వారిపై ఫిర్యాదులు కూడా చేసేవారు కాదు.
అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలపైనా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితులైనప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేల పైనా కేసులు నమోదవుతున్నాయి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తాజాగా కేసు నమోదు అయింది. తనను కోటంరెడ్డి బెదిరించాడని ఒక ప్రతిక విలేకరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికార పార్టీకి చెందినప్పటికీ కోటంరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తప్పు ఉన్నట్టు తేలితే ఎవరినీ వదిలిపెట్టవద్దని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ నేతల పైనా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.