ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి.... సోషల్ మీడియా
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సోషల్ మీడియా వారధి లాంటిదని… ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా చేరవేసేది సోషల్ మీడియానేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఆదివారం నాడు తాడేపల్లిలో సోషల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ సాయిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా వాలంటీర్లు చేసిన కృషిని అభినందించారు. “ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు […]
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సోషల్ మీడియా వారధి లాంటిదని… ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా చేరవేసేది సోషల్ మీడియానేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు.
ఆదివారం నాడు తాడేపల్లిలో సోషల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ సాయిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా వాలంటీర్లు చేసిన కృషిని అభినందించారు.
“ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత సోషల్ మీడియా వాలంటీర్లదే. మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వంటి వారు” అని విజయసాయి రెడ్డి అన్నారు.
సోషల్ మీడియా వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం చేసే అనేక మంచి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లడమే కాకుండా ప్రజల ఇబ్బందులను కూడా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా వాలంటీర్లపై ఉందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వాలంటీర్లను ఇబ్బందులకు గురి చేశారని, వారిపై కేసులు పెట్టారని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సోషల్ మీడియా వాలంటీర్లపై పెట్టిన పాత కేసులన్నింటినీ త్వరలో ఎత్తివేస్తామని విజయ సాయిరెడ్డి హామీ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఆయన పచ్చ మీడియా అవాస్తవాలను ప్రచారం చేసిందని విమర్శించారు. సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేటి తరుణంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు.
సోషల్ మీడియా వాలంటీర్లకు తమ ప్రభుత్వం అన్ని విధాల చేయూతనిస్తుందని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పరిష్కరిస్తామని విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు.