Telugu Global
NEWS

ఉపాధ్యాయుల భర్తీకి క్యాలెండర్

ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని, విద్యాప్రమాణాలను పెంచుతూ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర్రంలో విద్యావ్యవస్థ తీరు తెన్నులు, విద్యావిధానాన్ని పటిష్ట పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ట్రంలోని 42, 655 పాఠశాలల  ఫొటోలు, వీడియోలు తీయాలని, సంవత్సరం తర్వాత ఆ పాఠశాలల్లో వచ్చిన మార్పులను పాత ఫొటోలు, వీడియోలతో సరిపోల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలలోను విద్యార్ధుల తలిదండ్రులు, […]

ఉపాధ్యాయుల భర్తీకి క్యాలెండర్
X

ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని, విద్యాప్రమాణాలను పెంచుతూ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్ర్రంలో విద్యావ్యవస్థ తీరు తెన్నులు, విద్యావిధానాన్ని పటిష్ట పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ట్రంలోని 42, 655 పాఠశాలల ఫొటోలు, వీడియోలు తీయాలని, సంవత్సరం తర్వాత ఆ పాఠశాలల్లో వచ్చిన మార్పులను పాత ఫొటోలు, వీడియోలతో సరిపోల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.

ప్రతి పాఠశాలలోను విద్యార్ధుల తలిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యా కమిటీలను నియమించాలని, ఆ కమిటీలు విరివిగా సమావేశమై ఆ పాఠశాల పరిస్థితిపై సమీక్షలు జరపాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైతే అదనపు తరగతి గదులను నిర్మించాలని, పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంలో ఎలాంటి రాజీ పడరాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో టాయ్ లెట్లు, విద్యుత్ సదుపాయాలు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు, యూనిఫాం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, దీనిని అనుసరించి ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టాలని సూచించారు.

“పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు క్యాలెండర్ ను రూపొందించండి. దీనిని ప్రజల ముందు ఉంచండి.ఆ క్యాలండర్ ప్రకారమే నియామకాలు చేపట్టండి” అని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలోను ఆంగ్లం తప్పనిసరే అయినా తెలుగు భాషకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, తల్లిభాషను నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

First Published:  11 Aug 2019 2:57 AM IST
Next Story