ఎన్‌డీ టీవీ ప్రణయ్ రాయ్ నిర్బంధం
ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లకుండా వారిని ఆపేశారు. వృత్తిరిత్యా జర్నలిస్టులైన ప్రణయ్ రాయ్, అతడి భార్య రాధిక విదేశాలకు వెళ్లి ఆగస్ట్ 16న తిరిగి రావాల్సి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఆర్థిక అవకతవకల కేసులో ప్రణయ్ దంపతులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు నేపథ్యంలోనే ప్రణయ్ రాయ్‌ని విదేశాలకు వెళ్లకుండా ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఎన్‌డీ […]

ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లకుండా వారిని ఆపేశారు.
వృత్తిరిత్యా జర్నలిస్టులైన ప్రణయ్ రాయ్, అతడి భార్య రాధిక విదేశాలకు వెళ్లి ఆగస్ట్ 16న తిరిగి రావాల్సి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఆర్థిక అవకతవకల కేసులో ప్రణయ్ దంపతులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ కేసు నేపథ్యంలోనే ప్రణయ్ రాయ్‌ని విదేశాలకు వెళ్లకుండా ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఎన్‌డీ టీవీ కూడా ధృవీకరించింది. మీడియా సంస్థలను బెదిరించి దారికి తెచ్చుకునే చర్యల్లో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపించింది.
జర్నలిస్ట్‌లు అయిన ప్రణయ్‌రాయ్ దంపతులను అడ్డుకోవడం మీడియా స్వేచ్చపై దాడిగా అభివర్ణించింది. అయితే వారు ఏ దేశానికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదు.