Telugu Global
NEWS

అరుణ్‌ జైట్లీకి తీవ్ర అనారోగ్యం

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. గత కొద్దికాలంగా అరుణ్ జైట్లీ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనవరిలో అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స కూడా తీసుకున్నారు. గతేడాది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగింది. అనారోగ్యం కారణంగానే మోడీ రెండోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేకపోయారు. ప్రస్తుతం ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నట్టు ఎయిమ్స్ […]

అరుణ్‌ జైట్లీకి తీవ్ర అనారోగ్యం
X

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. గత కొద్దికాలంగా అరుణ్ జైట్లీ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనవరిలో అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స కూడా తీసుకున్నారు. గతేడాది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగింది.

అనారోగ్యం కారణంగానే మోడీ రెండోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేకపోయారు. ప్రస్తుతం ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. పల్స్ రేటు స్థిరంగానే ఉందని, ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

అరుణ్ జైట్లీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే పలువురు కేంద్రమంత్రులు అక్కడికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన జైట్లీ.. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.

First Published:  10 Aug 2019 2:05 AM IST
Next Story