Telugu Global
NEWS

వీహెచ్.... కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా?

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత ఎవరంటే అది వీ హనుమంతరావే…. రాజీవ్ గాంధీతో స్నేహం ఉన్న ఆయన తెలంగాణ రాజకీయాల్లో మాత్రం వెలిగింది లేదు.. పేరొందింది అంతకంటే లేదు. సోనియా హయాంలో వీహెచ్ కు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. అంతుకుముందు రెండు సార్లు ఆయన రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ తరుఫున ఎన్నికయ్యారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన వీహెచ్ ఎప్పుడూ గెలవలేదు. అయితే పార్టీలో తనను తొక్కేస్తున్నారని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలపై […]

వీహెచ్.... కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా?
X

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత ఎవరంటే అది వీ హనుమంతరావే…. రాజీవ్ గాంధీతో స్నేహం ఉన్న ఆయన తెలంగాణ రాజకీయాల్లో మాత్రం వెలిగింది లేదు.. పేరొందింది అంతకంటే లేదు.

సోనియా హయాంలో వీహెచ్ కు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. అంతుకుముందు రెండు సార్లు ఆయన రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ తరుఫున ఎన్నికయ్యారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన వీహెచ్ ఎప్పుడూ గెలవలేదు.

అయితే పార్టీలో తనను తొక్కేస్తున్నారని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలపై భగ్గుమన్నారు. వారి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందంటూ వాపోయారు వీహెచ్. పార్టీలోని నిజాయితీపరులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అభిమానులకు అవమానం జరుగుతోందని ఆయన ఆవేదన చెందారు.

కాంగ్రెస్ ముఖ్యనేతలపై సీరియస్ అయిన వీహెచ్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.

ఈ నెల 20న జరిగే రాజీవ్ గాంధీ జయంతి రోజున తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వీహెచ్ సంచలన ప్రకటన చేశారు. దీనిపై పార్టీ నేతలతో, కార్యకర్తలతో చర్చలు జరిపి కాంగ్రెస్ లో ఉండాలా? ఉండొద్దా? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తానని చెప్పుకొచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు, దళితులను తొక్కేస్తున్నారని.. సీట్లు, పదవుల్లో అన్యాయం చేస్తున్నారని వీహెచ్ తాజాగా వాపోయారు. ఖమ్మం టికెట్ ను మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తాను అడిగితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తన పేరును లేకుండానే జాబితాను ఢిల్లీకి పంపారని.. హైకమాండ్ లో కొందరు నిజాయితీ పరులకు అన్యాయం చేస్తున్నారనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.

కాగా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోవడం.. కాంగ్రెస్ లో ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలోనే వీహెచ్ ఇలా పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

First Published:  9 Aug 2019 9:51 AM IST
Next Story