శ్రీశైలం నుంచి సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలు
చాలా ఏళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ఆగస్ట్ నెలలోనే గేట్లు తెరుచుకుంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో పది రోజుల్లోనే శ్రీశైలం నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. ఇప్పటికీ ఎగువ నుంచి నాలుగు లక్షల క్కూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ మంత్రుల బృందం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసింది. Gates opening for release of water […]
చాలా ఏళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ఆగస్ట్ నెలలోనే గేట్లు తెరుచుకుంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో పది రోజుల్లోనే శ్రీశైలం నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. ఇప్పటికీ ఎగువ నుంచి నాలుగు లక్షల క్కూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
దీంతో ఏపీ, తెలంగాణ మంత్రుల బృందం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసింది.
Gates opening for release of water in Srisailam Dam by Water Resources Minister on 9-8-2019 at Srisailam, Kurnool District pic.twitter.com/g08whitMiU
— DDIPR_KNL (@ddipr_knl) August 9, 2019
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిలు పూజలు నిర్వహించి గేట్లు తెరిచారు. నాలుగు గేట్లను పది అడుగుల మేర తెరిచారు. లక్షా ఆరు వేల క్కూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
Press meet by Water Resources Minister on 9-8-2019 at Srisailam, Kurnool District pic.twitter.com/S8xe7EjGmz
— DDIPR_KNL (@ddipr_knl) August 9, 2019
ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 74వేల క్కూసెక్కుల నీటిని సాగర్ వైపు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 20వేల క్కూసెక్కులను వదిలారు. హంద్రీనీవా కాలువకు 338, ముచ్చుమర్రి లిఫ్టు నుంచి కేసీ కెనాల్ కు 735 క్యూసెక్కులు, తెలంగాణలోని కల్వకుర్తి లిఫ్టు ద్వారా 1,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ప్రవాహం ఇదే తరహాలో కొనసాగితే నాగార్జున సాగర్ కూడా వారం రోజుల్లో నిండిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ ప్రథమంలోనే శ్రీశైలం నుంచి సాగర్‌కు నీరు విడుదలవుతున్నందున… ఈసారి ప్రాజెక్టులు నిండడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదంటున్నారు.
శ్రీశైలం డ్యామ్ నుండి 4 గేట్ల ద్వారా దిగువకు ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడుతున్న కృష్ణమ్మ నీరు…తిలకించి ..సెల్ఫీలతో మురిసిన సందర్శకులు.. — DD I&PR pic.twitter.com/JGY5xPa54y
— DDIPR_KNL (@ddipr_knl) August 9, 2019