Telugu Global
NEWS

శ్రీశైలం గేట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం

పదేళ్ల తర్వాత కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుండలా ఉంది. గురువారం రాత్రి ఏడు గంటల సమయానికి ప్రాజెక్టులోకి మూడు లక్షల 71వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రవాహం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునుగుతుండడంతో ఆల్మట్టి నుంచి ఐదు లక్షల క్కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని మహారాష్ట్ర సీఎం పడ్నవీస్‌… కర్నాటక సీఎంను […]

శ్రీశైలం గేట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం
X

పదేళ్ల తర్వాత కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుండలా ఉంది. గురువారం రాత్రి ఏడు గంటల సమయానికి ప్రాజెక్టులోకి మూడు లక్షల 71వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రవాహం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునుగుతుండడంతో ఆల్మట్టి నుంచి ఐదు లక్షల క్కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని మహారాష్ట్ర సీఎం పడ్నవీస్‌… కర్నాటక సీఎంను కోరారు. ఇందుకు యడ్యూరప్ప అంగీకరించారు.

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 173 టీఎంసీల నీరు ఉంది. పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో శనివారం ఉదయం జలాశయం నుంచి నాలుగు గేట్లను 10 అడుగుల మేర లిప్ట్ చేసి నీటిని దిగువకు వదలనున్నారు.

ఇప్పటికే 73వేల క్కూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 138 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండేందుకు మరో 174 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లోనే నాగార్జున సాగర్‌ కూడా నిండే అవకాశం ఉంది.

First Published:  9 Aug 2019 1:23 AM IST
Next Story