'మన్మథుడు 2' సినిమా రివ్యూ
రివ్యూ : మన్మథుడు 2 రేటింగ్ : 1.75/5 తారాగణం : నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, లక్ష్మీ, దేవదర్శిని, రావు రమేష్, ఝాన్సీ తదితరులు సంగీతం : చైతన్ భరద్వాజ్ నిర్మాత : అక్కినేని నాగార్జున, పి కిరణ్ దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్ 2002లో నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ సినిమా తో […]
రివ్యూ : మన్మథుడు 2
రేటింగ్ : 1.75/5
తారాగణం : నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, లక్ష్మీ, దేవదర్శిని, రావు రమేష్, ఝాన్సీ తదితరులు
సంగీతం : చైతన్ భరద్వాజ్
నిర్మాత : అక్కినేని నాగార్జున, పి కిరణ్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
2002లో నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ సినిమా తో నాగార్జున మన ముందుకు వచ్చాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.
టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాలో లక్ష్మీ, వెన్నెల కిషోర్, దేవదర్శిని, ఝాన్సీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు విడుదలైంది.
కథ:
సాంబశివ రావు అలియాస్ సామ్ (నాగార్జున అక్కినేని) పోర్చుగల్ లో కుటుంబం తో సెటిల్ అవుతాడు. అతనికి పెళ్ళంటే అసలు ఇష్టం లేదు… కానీ అతనొక ప్లే బాయ్. ఎప్పుడూ అమ్మాయిల వెనుక తిరుగుతూ ఉంటాడు. కానీ అతని కుటుంబం మాత్రం పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంది. మరి అలాంటి సమయంలో సామ్ ఏం చేసాడు? ఒక గర్ల్ ఫ్రెండ్ ని రెంట్ కి తీసుకుని సామ్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
నాగార్జున నటన ఈ సినిమాకి కొంతవరకు ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా పర్వాలేదనిపించింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ రకుల్ ప్రీత్ ఈ సినిమాలో బాగానే నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున తో రకుల్ కెమిస్ట్రీ పరవాలేదనిపిస్తుంది. ఎప్పటిలాగానే లక్ష్మి ఈ సినిమాలో చాలా సహజంగా నటించారు. దేవదర్శిని మరియు ఝాన్సీ తమ పాత్రలకు న్యాయం చేశారు. రావు రమేష్ బాగా నటించాడు. తన పాత్రలో ఒదిగిపోయిన వెన్నెల కిషోర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. సమంత, అక్షర గౌడ మరియు కీర్తి సురేష్ స్పెషల్ అప్పీరన్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమా కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక మంచి కథను తీసుకున్నాడు. అయితే బలమైన కథనం లేకపోవడంతో…. ఒక సింపుల్ కథను తీసుకొని అలా అలా నెరేట్ చేశాడు దర్శకుడు. ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కి రాహుల్ రవీంద్రన్ ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడని సినిమా చూస్తే తెలుస్తుంది.
నాగార్జున అక్కినేని ఈ సినిమాకి అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి మంచి సంగీతాన్ని అందించారు. ఒకటి రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ లుగా మారాయి. సినిమా లోని నేపథ్య సంగీతం కూడా ఎమోషన్లని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఈ సినిమా కోసం చాలా మంచి విజువల్స్ అందించారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.
బలాలు:
నాగార్జున, కామెడీ, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
బలహీనతలు:
కొన్ని సాగతీత సన్నివేశాలు, ప్రేడిక్టబుల్ స్టోరీ
చివరి మాట:
పేరుకి సీక్వెల్ అయినప్పటికీ ‘మన్మథుడు’ కి ఇప్పటి ‘మన్మథుడు 2’ సినిమా కి ఏమాత్రం పోలికలు ఉండవు. రెండూ విభిన్నమైన కథలు. ‘మన్మథుడు 2’ కేవలం ఒక ఎంటర్ టైనింగ్ గా అలా సాగిపోతుంది అంతే. అయితే సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా పెలిన కామెడీ ఈ సినిమా చూసే ప్రేక్షకులను కాపాడింది.
బాటమ్ లైన్: కథ లేకుండా ఎంటర్ టైన్ మెంట్ తో నడిచే మోడరన్ ‘మన్మథుడు’.