Telugu Global
National

వేలూరులోనూ గెలుపు జెండా ఎగరేసిన డీఎంకే

తమిళనాడులో డీఎంకే హవా కొనసాగుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే స్వీప్ చేసేసింది. వేలూరు స్థానానికి మాత్రం అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. వేలూరు డీఎంకే అభ్యర్థి కదీర్‌ గోడౌన్‌లో 10 కోట్ల రూపాయల నగదు పట్టుబడడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా వేశారు. ఆ స్థానానికి ఈనెల 5న పోలింగ్ నిర్వహించారు. శుక్రవారం కౌంటింగ్ జరిగింది. ఈ స్థానాన్ని కూడా డీఎంకే కైవసం చేసుకుంది. అన్నాడీఎంకే అభ్యర్థి ఏసీ షణ్ముగంపై 8వేల 142 […]

వేలూరులోనూ గెలుపు జెండా ఎగరేసిన డీఎంకే
X

తమిళనాడులో డీఎంకే హవా కొనసాగుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే స్వీప్ చేసేసింది. వేలూరు స్థానానికి మాత్రం అప్పుడు ఎన్నిక వాయిదా పడింది.

వేలూరు డీఎంకే అభ్యర్థి కదీర్‌ గోడౌన్‌లో 10 కోట్ల రూపాయల నగదు పట్టుబడడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా వేశారు. ఆ స్థానానికి ఈనెల 5న పోలింగ్ నిర్వహించారు. శుక్రవారం కౌంటింగ్ జరిగింది. ఈ స్థానాన్ని కూడా డీఎంకే కైవసం చేసుకుంది.

అన్నాడీఎంకే అభ్యర్థి ఏసీ షణ్ముగంపై 8వేల 142 ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి కదీర్ ఆనంద్ విజయం సాధించారు. తొలుత డీఎంకే అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నా ఆ తర్వాత డీఎంకే బాగా పుంజుకుని గెలుపు సొంతం చేసుకుంది.

ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే 37 స్థానాలను సొంతం చేసుకుని తిరుగులేదనిపించుకుంది. ఇప్పుడు వేలూరు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.

First Published:  9 Aug 2019 2:09 PM IST
Next Story