Telugu Global
NEWS

కలెక్టర్‌కు అంతకోపం ఎందుకొచ్చిందో?

మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రాస్‌ కు కోపం వచ్చింది. అంతే… 88 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్సెండ్‌ చేశారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే…. గురువారం నాడు మహబూబ్‌ నగర్‌ లో హరిత హారం పై ఎంపీడీఓలు, ఎపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ గంటన్నర ఆలస్యంగా వెళ్ళారు. సాయంత్రం 4 గంటలకు సమావేశం అని చెప్పారు…. కానీ రాత్రి 7 గంటలకు సమావేశం ప్రారంభం […]

కలెక్టర్‌కు అంతకోపం ఎందుకొచ్చిందో?
X

మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రాస్‌ కు కోపం వచ్చింది. అంతే… 88 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్సెండ్‌ చేశారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే…. గురువారం నాడు మహబూబ్‌ నగర్‌ లో హరిత హారం పై ఎంపీడీఓలు, ఎపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి కలెక్టర్‌ గంటన్నర ఆలస్యంగా వెళ్ళారు. సాయంత్రం 4 గంటలకు సమావేశం అని చెప్పారు…. కానీ రాత్రి 7 గంటలకు సమావేశం ప్రారంభం అయింది. రాత్రి 8:30 కు ఆ సమావేశానికి వెళ్ళారు కలెక్టర్‌. ఆయన వెళ్ళేసరికి కొంతమంది ఉద్యోగులు సమావేశం నుంచి వెళ్ళిపోయారు. దాంతో కలెక్టర్‌కు కోపం వచ్చింది. సమావేశంలో లేని ఉద్యోగులందరినీ సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో 88 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

అదేమీ ప్రకృతి విపత్తులకు సంబంధించిన అత్యవసర సమావేశం కాదు…. లేదా ఎమర్జెన్సీ మీటింగ్‌ కాదు…. హరిత హారానికి సంబంధించిన మీటింగ్‌…. అలాంటి మీటింగ్‌ను రాత్రి వేళలో పెట్టడం ఏమిటో? కలెక్టర్‌ గంటన్నర ఆలస్యంగా రావడం ఏమిటో? ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం ఏమిటో? ఉద్యోగులకు ఒక పని వేళలు ఉండవా? ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోగా జరిగిన సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే శిక్షించడం సబబే. కానీ రాత్రి వేళ దాకా సాగే సమావేశాలకు ఉండనందుకు కోప్పడవచ్చు… మందలించవచ్చు. అంతేగానీ ఇలా సస్పెండ్‌ చేయడం ఏమిటో?

అధికారం ఎక్కువైతే అంత కోపం వస్తుంది కాబోలు…!

First Published:  9 Aug 2019 1:54 AM GMT
Next Story