Telugu Global
National

చీప్‌ ట్రిక్స్‌తో దొరికిపోయిన చంద్రబాబు, వర్ల రామయ్య

ట్విట్టర్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెల్లో ఇద్దరు ఆడవాళ్ళు నీటి కొళాయి దగ్గర గొడవపడ్డా సరే లోకేష్ ట్వీట్‌ చేసేస్తున్నారు. కొట్టిన ఆమె వైసీపీ… కొట్టించుకున్న ఆమె టీడీపీ అంటూ లబోదిబో అంటున్నాడు. కుమారుడిని చూసి స్పూర్తి పొందిన చంద్రబాబు కూడా ట్విట్టర్‌ను అదే తరహాలో వాడుతున్నారు. తాజాగా ఆశా వర్కర్లపై చంద్రబాబు సానుభూతిని వెళ్ళబోశారు. ఆశా […]

చీప్‌ ట్రిక్స్‌తో దొరికిపోయిన చంద్రబాబు, వర్ల రామయ్య
X

ట్విట్టర్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెల్లో ఇద్దరు ఆడవాళ్ళు నీటి కొళాయి దగ్గర గొడవపడ్డా సరే లోకేష్ ట్వీట్‌ చేసేస్తున్నారు. కొట్టిన ఆమె వైసీపీ… కొట్టించుకున్న ఆమె టీడీపీ అంటూ లబోదిబో అంటున్నాడు. కుమారుడిని చూసి స్పూర్తి పొందిన చంద్రబాబు కూడా ట్విట్టర్‌ను అదే తరహాలో వాడుతున్నారు.

తాజాగా ఆశా వర్కర్లపై చంద్రబాబు సానుభూతిని వెళ్ళబోశారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ జీవో విడుదలైనా సరే దాన్ని పట్టించుకోకుండా ఒక ట్వీట్ పెట్టారు. జగన్ సీఎం అయిన తొలి రోజుల్లో పాలాభిషేకం చేసిన మహిళలు ఇప్పుడు ఆయనకు శవయాత్ర నిర్వహిస్తున్నారన్నది చంద్రబాబు ట్వీట్. అందుకోసం రెండు ఫోటోలను కూడా ట్వీట్‌కు జత చేశారు.

అందులో ఒకటి జగన్‌కు ఆశా వర్కర్లు పాలాభిషేకం చేస్తున్నది కాగా.. రెండవది దిష్టిబొమ్మ శవయాత్ర ఫోటో. చూశారా మొన్న ఇలా పాలాభిషేకం చేసిన ఆశావర్కర్లు ఇప్పుడు శవయాత్ర చేస్తున్నారంటూ ట్వీట్ పెట్టారు బాబు. కానీ శవయాత్రకు సంబంధించిన ఫోటో ఏపీకి చెందినదే కాదు.

2015లో తెలంగాణలోని నిజామాబాద్‌లో ఆశా వర్కర్లు నిర్వహించిన శవయాత్రకు సంబంధించినది. ఆ ఫోటోను ఎత్తుకొచ్చి … జగన్‌కు శవయాత్ర చేస్తున్నారంటూ 40 ఏళ్ల రాజకీయం, సుధీర్ఘకాలం సీఎంగా చేసిన చంద్రబాబు చీప్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో చంద్రబాబుపై ట్రోల్ చేస్తున్నారు.

చంద్రబాబు పెట్టిన ట్వీట్ చూసి వర్ల రామయ్య కూడా అదే మేటర్ తో, అదే ఫొటోతో ట్వీట్ చేశాడు.

”To AP CM. అయ్యా! పాడే మోసే మహిళలు హెల్త్ వర్కర్స్ లాగ వున్నారు. ఏమిటీ ఖర్మ వాళ్లకు? ఏదో మాట తప్పారట, అందుకని మీ ప్రభుత్వానికి పాడే కట్టినట్టున్నారు. మాట తప్పని, మడెం తిప్పని మీరు, చిరు ఉద్యోగుల కడుపు కొట్టకండి. న్యాయం జరిగేలా చూడండి. ఇదే రాజన్న రాజ్యం.”

First Published:  9 Aug 2019 5:23 AM IST
Next Story