Telugu Global
NEWS

కాంగ్రెస్‌ ప్లాన్‌తో బీజేపీకి ఎదురుదెబ్బే !

మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. టీఆర్ఎస్ అన్ని నగరపాలికలను చేజిక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. ఇక బీజేపీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. పోరు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయేనా అన్న చర్చ సాగుతుండగా కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అధికార టీఆర్ఎస్, బీజేపీలకు షాకింగ్ లా మారింది. పట్టణాలలో టీఆర్ఎస్ కు బలమైన నాయకత్వ శ్రేణి ఉంది. అక్కడ పోటీ చేయడానికి నేతలు ఎక్కువగా పోటీపడుతున్నారు. టికెట్లు రాని నేతలను, టీఆర్ఎస్ […]

కాంగ్రెస్‌ ప్లాన్‌తో బీజేపీకి ఎదురుదెబ్బే !
X

మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. టీఆర్ఎస్ అన్ని నగరపాలికలను చేజిక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. ఇక బీజేపీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. పోరు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయేనా అన్న చర్చ సాగుతుండగా కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అధికార టీఆర్ఎస్, బీజేపీలకు షాకింగ్ లా మారింది.

పట్టణాలలో టీఆర్ఎస్ కు బలమైన నాయకత్వ శ్రేణి ఉంది. అక్కడ పోటీ చేయడానికి నేతలు ఎక్కువగా పోటీపడుతున్నారు. టికెట్లు రాని నేతలను, టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను లాగేసి టికెట్లు ఇచ్చి పోటీచేయించాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. టీఆర్ఎస్ బలంపైనే ఆ నాయకులను లాగి గెలవాలని చూస్తోంది.

అయితే ఈ రెండు పార్టీలకు ధీటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్ గీసింది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలు, 12 శాతంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు బేస్ చేసుకొని సగం సీట్లను వారికే కేటాయిస్తున్నట్టు తాజాగా కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర జనాభాలో బీసీల సంఖ్య సగానికి పైగా ఉంది. దీంతో వారి బలంతో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది.

మున్సిపల్ ఎన్నికలపై తాజాగా టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో బీసీ జనాభా ఆధారంగా బీసీలకే సగం సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీసీ వ్యతిరేక ముద్రపడిందని.. బీసీలకు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని.. అందుకే వారిని ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.

First Published:  9 Aug 2019 6:45 AM IST
Next Story