మరికాసేపట్లో భారత్-విండీస్ తొలివన్డే
గయానా వేదికగా ఢీ అంటే ఢీ క్రిస్ గేల్ పైనే విండీస్ ఆశలు వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ కు…గయానాలోని జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ తొలి పోరులో విజయమే లక్ష్యంగా రెండుజట్లు సమరానికి సిద్ధమయ్యాయి. హాట్ ఫేవరెట్ భారత్… తీన్మార్ టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ తో సొంతం చేసుకొన్న భారతజట్టు…వన్డే సిరీస్ లో సైతం హాట్ ఫేవరెట్ […]
- గయానా వేదికగా ఢీ అంటే ఢీ
- క్రిస్ గేల్ పైనే విండీస్ ఆశలు
వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ కు…గయానాలోని జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ తొలి పోరులో విజయమే లక్ష్యంగా రెండుజట్లు సమరానికి సిద్ధమయ్యాయి.
హాట్ ఫేవరెట్ భారత్…
తీన్మార్ టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ తో సొంతం చేసుకొన్న భారతజట్టు…వన్డే సిరీస్ లో సైతం హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్- రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ విరాట్ కొహ్లీ ,యువఆటగాళ్లు రాహుల్, రిషభ్ పంత్ భారీస్కోర్లకు గురిపెట్టారు.
విండీస్ ప్రత్యర్థిగా ఇప్పటికే అత్యధికంగా ఏడు సెంచరీలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో 19 పరుగులు సాధించ గలిగితే… విండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలువగలుగుతాడు.
విండీస్ పై 64 మ్యాచ్ ల్లో 1930 పరుగులు సాధించిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ పేరుతో ఉంది. ఆ రికార్డును కొహ్లీ అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విండీస్ కు 7-8 రికార్డు
గయానాలోని జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఆతిథ్య విండీస్ ఇప్పటి వరకూ ఆడిన 15 వన్డేలలో 7 విజయాలు, 8 పరాజయాల రికార్డుతో ఉంది. అంతేకాదు…గత ఐదువన్డేలలో 2 విజయాలు, 3 పరాజయాలు సాధించింది.
విండీస్ 62, భారత్ 60 విజయాలు
ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, విండీస్ ఇప్పటి వరకూ 127 వన్డేల్లో ఫేస్ టు ఫేస్ తలపడితే…కరీబియన్ టీమ్ 62, భారత్ 60 విజయాల రికార్డుతో ఉన్నాయి. కరీబియన్ గడ్డపై ఈ రెండుజట్లూ 36 వన్డేల్లో తలపడితే…విండీస్ 20, భారత్ 14 విజయాల రికార్డుతో నిలిచాయి.
భారత్ పై విండీస్ కు 62 శాతం, విండీస్ పై భారత్ కు 58 శాతం విజయాలు ఉన్నాయి.
జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ జట్టులో సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ కీలకం కానున్నాడు. ఇంగ్లండ్ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ఓడితే…విండీస్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.