కియా తొలి కారు ఇప్పుడు విడుదల.... అప్పుడు విడుదలైంది?
లోకేష్ ఓ పచ్చినిజం చెప్పారు. కియా మోటార్స్ ఘనతను తమ ఖాతాలో వేసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ కంపెనీ తన తొట్టతొలి కారును భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జగన్ ఢిల్లీలో ఉండడంతో ఈ వేడుకకు వైసీపీ మంత్రులు హాజరై మేడ్ ఇన్ ఆంధ్రాగా తయారైన కియా కారును ఆవిష్కరించనున్నారు. అయితే చంద్రబాబు హయాంలో వచ్చినట్టు చెప్పుకుంటున్న కియా మోటార్స్ తొలి కారు విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో నారా […]
లోకేష్ ఓ పచ్చినిజం చెప్పారు. కియా మోటార్స్ ఘనతను తమ ఖాతాలో వేసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ కంపెనీ తన తొట్టతొలి కారును భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జగన్ ఢిల్లీలో ఉండడంతో ఈ వేడుకకు వైసీపీ మంత్రులు హాజరై మేడ్ ఇన్ ఆంధ్రాగా తయారైన కియా కారును ఆవిష్కరించనున్నారు.
అయితే చంద్రబాబు హయాంలో వచ్చినట్టు చెప్పుకుంటున్న కియా మోటార్స్ తొలి కారు విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే ఓ పోస్టు పెట్టారు. ‘చంద్రబాబు దార్శనికతకు కియా మోటార్స్ ఫలితమిచ్చింది. ఏపీలో చంద్రబాబు కృషితో నెలకొల్పిన ఈ ప్లాంట్ నుంచి తొలి కారు విడుదలవ్వడం మాటల్లో చెప్పలేనిది. ఈ సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు’ అంటూ లోకేష్ కియా ఘనతను చంద్రబాబుకు ఆపాదించి ఓ పేపర్ కటింగ్ తో తాజాగా పోస్టు చేశారు.
అయితే లోకేష్ బాబు కియా కార్ల కంపెనీల కృషిని అభినందించడం కరెక్టే. అందరూ ఒప్పుకోవాల్సిన ఘనతే. కానీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చివరి రోజుల్లో ఆవిష్కరించిన తొలి కారు ఉత్తదేనా అన్న ప్రశ్నను వైసీపీ శ్రేణులు ఎండగడుతున్నాయి.
నాడు నల్లటి కారును చంద్రబాబు నడిపి ఆవిష్కరించినట్టు చూపించారు. మరి కియా తొలి కారు ఇప్పుడు ఆవిష్కృతం అయితే అప్పుడు చంద్రబాబు ఆవిష్కరించింది డమ్మీ కారా? అది ఎన్నికల స్టంటా? అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అప్పుడు చంద్రబాబు ఆవిష్కరించిన కారు ఇక్కడ తయారైంది కాదని, కొరియాలో తయారైన కారును అక్కడి నుంచి తీసుకువచ్చి చంద్రబాబు ఇక్కడ ఆవిష్కరించిన విషయం తరువాత బయటపడింది.
ఏది ఏమైనా కియా మోటార్స్ ఏపీకి వచ్చింది.. ఉత్పత్తి మొదలు పెట్టింది. తొలికారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆంధ్రాలో తయారైన ఈ కారు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే కియా క్రెడిట్ ను మాత్రం ఇప్పుడు ఎవరికి వారే తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నాడు ప్రధాని మోడీ సూచనతోనే ఏపీకి కియా వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక చంద్రబాబు కృషి వల్లనే సంస్థ ఏర్పాటైందని లోకేష్, టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇక వైఎస్ హయాంలోనే కియా సంస్థ 2007లో ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని… కియా యాజమాన్యం రాసిన లేఖను కొద్దిరోజుల క్రితమే వైసీపీ విడుదల చేయడం తెలిసిందే.