భారత్ తో వన్డే సిరీస్ కు విండీస్ జట్టులో క్రిస్ గేల్
ఆగస్టు 8 నుంచి భారత్-విండీస్ వన్డే సిరీస్ కరీబియన్ ద్వీపాలలో భారతజట్టు నెలరోజుల పర్యటన రెండో అంకానికి చేరింది. తొలి అంచె తీన్మార్ టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన భారత్…ఆగస్టు 8న ప్రారంభమయ్యే తీన్మార్ వన్డే సిరీస్ లో సైతం బ్రౌన్ వాషే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గయానా వేదికగా తొలివన్డే… గయానా ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే తొలివన్డేలో రెండోర్యాంకర్ భారత్ కు…9వ ర్యాంకర్ విండీస్ సవాలు విసురుతోంది. భారత కాలమానం ప్రకారం […]
- ఆగస్టు 8 నుంచి భారత్-విండీస్ వన్డే సిరీస్
కరీబియన్ ద్వీపాలలో భారతజట్టు నెలరోజుల పర్యటన రెండో అంకానికి చేరింది. తొలి అంచె తీన్మార్ టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన భారత్…ఆగస్టు 8న ప్రారంభమయ్యే తీన్మార్ వన్డే సిరీస్ లో సైతం బ్రౌన్ వాషే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
గయానా వేదికగా తొలివన్డే…
గయానా ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే తొలివన్డేలో రెండోర్యాంకర్ భారత్ కు…9వ ర్యాంకర్ విండీస్ సవాలు విసురుతోంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ స్టేడియంలో ఆగస్టు 11, 14 తేదీలలో రెండు, మూడు వన్డేలు నిర్వహిస్తారు.
విండీస్ జట్టులో క్రిస్ గేల్…
సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ .. వెస్టిండీస్ జట్టు తరపున ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. మొత్తం 14 మంది సభ్యుల కరీబియన్ జట్టు వివరాలను విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలోని జట్టులో జాన్ కాంప్ బెల్, క్రిస్ గేల్, ఇవిన్ లూయిస్, షెర్మాన్ హెట్ మేయర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, షై హోప్, ఫేబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్ వెయిట్, కీమో పాల్, షెల్డన్ కోట్రెల్, ఓషన్ థామస్, కెమెర్ రోచ్ సభ్యులుగా ఉన్నారు.