Telugu Global
NEWS

టీ-20 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్

ఆఖరి టీ-20లో రిషభ్ పంత్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ మూడుకు మూడు టీ-20లూ ఓడిన కరీబియన్ టీమ్ కరీబియన్ ద్వీపాలలో నెలరోజుల పర్యటన తొలి అంచెను విరాట్ సేన హ్యాట్రిక్ విజయాలతో ప్రారంభించింది. ప్రపంచ చాంపియన్, ఆతిథ్య విండీస్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 3-0తో అలవోకగా గెలుచుకొంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి టీ-20ని 7 వికెట్ల తేడాతో గెలుచుకొంది. దీపక్ చహార్ షో… ఫ్లారిడా వేదికగా ముగిసిన మొదటి రెండు […]

టీ-20 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్
X
  • ఆఖరి టీ-20లో రిషభ్ పంత్ ధూమ్ ధామ్ బ్యాటింగ్
  • మూడుకు మూడు టీ-20లూ ఓడిన కరీబియన్ టీమ్

కరీబియన్ ద్వీపాలలో నెలరోజుల పర్యటన తొలి అంచెను విరాట్ సేన హ్యాట్రిక్ విజయాలతో ప్రారంభించింది. ప్రపంచ చాంపియన్, ఆతిథ్య విండీస్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 3-0తో అలవోకగా గెలుచుకొంది.

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి టీ-20ని 7 వికెట్ల తేడాతో గెలుచుకొంది.

దీపక్ చహార్ షో…

ఫ్లారిడా వేదికగా ముగిసిన మొదటి రెండు టీ-20లు నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్ ..గయానాలోని జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి టీ-20లో చహార్ బ్రదర్స్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.

సిరీస్ లో వరుసగా మూడోసారి టాస్ నెగ్గిన భారత కెప్టెన్ కొహ్లీ…మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

భారత ఓపెనింగ్ బౌలర్ దీపక్ చహార్ అరంగేట్రం మ్యాచ్ లోనే చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే స్వింగ్ తో కరీబియన్ ఓపెనర్లు ఇవిన్ లూయిస్, సునీల్ నరైన్, వన్ డౌన్ హెడ్ మేయర్ లను తక్కువ స్కోర్లకే పెవీలియన్ దారి పట్టించాడు.

14 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన విండీస్ ను మరోసారి మిడిలార్డర్ ఆటగాళ్లు కిరాన్ పోలార్డ్, పూరన్, రోవెన్ పావెల్ ఆదుకొన్నారు.

పోలార్డ్ ఫైటింగ్ హాఫ్ సెంచరీ..

విండీస్ సీనియర్ ఆటగాడు కిరాన్ పోలార్డ్ మరోసారి బాధ్యతాయుతంగా ఆడి 45 బాల్స్ లో ఒక బౌండ్రీ, 6 సిక్సర్లతో 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

పోలార్డ్ కు విండీస్ తరపున గత ఏడేళ్లలో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

భారత బౌలర్లలో దీపక్ చహార్ కు 3 వికెట్లు, సైనీకి 2 వికెట్లు, రాహుల్ చహార్ కు 1 వికెట్ దక్కాయి.

కొహ్లీ-పంత్ ఫటాఫట్…

20 ఓవర్లలో 147 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్..ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్లు శిఖర్ ధావన్ 3, రాహుల్ 20 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.

దీంతో జట్టు విజయభారాన్ని కెప్టెన్ కొహ్లీ తన భుజలాపైన వేసుకొన్నాడు. యువఆటగాడు రిషభ్ పంత్ తో కలసి మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

విరాట్ కొహ్లీ 45 బాల్స్ లో 6 బౌండ్రీలతో 59, రిషభ్ పంత్ 42 బాల్స్ లోనే 4 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 65 పరుగులు సాధించారు.

భారత్ 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 7 వికెట్ల విజయంతో సిరీస్ స్వీప్ పూర్తి చేసింది.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన దీపక్ చహార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ మూడుమ్యాచ్ ల్లో నిలకడగా రాణించిన స్పిన్ ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

ప్రపంచ చాంపియన్ విండీస్ కు గత ఏడు టీ-20ల్లో ఇది వరుసగా ఏడో ఓటమి కావడం విశేషం. ఈ రెండుజట్ల మధ్య తీన్మార్ వన్డే సిరీస్ ఆగస్టు 8 న ప్రారంభమవుతుంది.

కెప్టెన్ కొహ్లీకి టీ-20 క్రికెట్లో ఇది 21వహాఫ్ సెంచరీ కాగా…రిషభ్ పంత్ కు రెండో హాఫ్ సెంచరీ మాత్రమే.

First Published:  7 Aug 2019 6:20 AM IST
Next Story