Telugu Global
Cinema & Entertainment

మిల్కీ బ్యూటీ కోసం పెళ్ళికొడుకుని వెతుకుతున్నారట

మిల్కీ బ్యూటీ తమన్నా చేతిలో ప్రస్తుతం బోలెడు సినిమాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమె త్వరలో పెళ్లిచేసుకోబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. గతంలో తమన్నా ఒక హీరోతో ప్రేమలో ఉందని ఆ హీరోకి ఇదివరకే పెళ్లి అయి విడాకులు తీసుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ తమన్నా అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఆ తరువాత తమన్నా ఒక ముంబైకి చెందిన వ్యాపారి తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వినిపించాయి. […]

మిల్కీ బ్యూటీ కోసం పెళ్ళికొడుకుని వెతుకుతున్నారట
X

మిల్కీ బ్యూటీ తమన్నా చేతిలో ప్రస్తుతం బోలెడు సినిమాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమె త్వరలో పెళ్లిచేసుకోబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి.

గతంలో తమన్నా ఒక హీరోతో ప్రేమలో ఉందని ఆ హీరోకి ఇదివరకే పెళ్లి అయి విడాకులు తీసుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ తమన్నా అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఆ తరువాత తమన్నా ఒక ముంబైకి చెందిన వ్యాపారి తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల పై కూడా క్లారిటీ ఇచ్చింది తమన్నా.

ఇలా ఎప్పటికప్పుడు తన పెళ్లి మరియు ప్రేమ విషయాల గురించి వచ్చే వార్తలపై క్లారిటీ ఇస్తూ వచ్చిన తమన్నా కోసం ఇంట్లో వాళ్లు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టేశారట. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే చెప్పుకొచ్చింది.

తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, ఇప్పటికే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, పెళ్లి విషయంలో తల్లిదండ్రులకే తన తుది నిర్ణయాన్ని వదిలేసినట్లుగా చెప్పిన తమన్నా…. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని మళ్లీ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి కుదిరితే మాత్రం ముందుగా మీడియాతో, అభిమానులు తోనే ఆ విషయాన్ని పంచుకుంటానని హామీ కూడా ఇచ్చింది.

First Published:  7 Aug 2019 11:17 AM IST
Next Story