ముగ్గుర్ని ప్రేమించాను కానీ....
వెండితెరపై లవర్ బాయ్స్ చాలామంది ఉన్నారు. కానీ రియల్ లైఫ్ లో అలాంటి లవర్ బాయ్ ట్యాగ్ లైన్ సందీప్ కిషన్ కు ఇచ్చేయాల్సిందే. అవును.. ఇతడి ఎఫైర్లపై వచ్చినన్ని పుకార్లు అన్నీ ఇన్నీ కావు. మినిమం గ్యాప్స్ లో సందీప్ కిషన్ లవ్ ఎఫైర్లపై గాసిప్స్ వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్నింటిని ఖండించిన సందీప్, మరికొన్నింటిపై మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఎట్టకేలకు తన లవ్ లైఫ్ పై స్పందించాడు సందీప్. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. […]
వెండితెరపై లవర్ బాయ్స్ చాలామంది ఉన్నారు. కానీ రియల్ లైఫ్ లో అలాంటి లవర్ బాయ్ ట్యాగ్ లైన్ సందీప్ కిషన్ కు ఇచ్చేయాల్సిందే. అవును.. ఇతడి ఎఫైర్లపై వచ్చినన్ని పుకార్లు అన్నీ ఇన్నీ కావు. మినిమం గ్యాప్స్ లో సందీప్ కిషన్ లవ్ ఎఫైర్లపై గాసిప్స్ వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్నింటిని ఖండించిన సందీప్, మరికొన్నింటిపై మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఎట్టకేలకు తన లవ్ లైఫ్ పై స్పందించాడు సందీప్.
ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో డేటింగ్ చేశానని ఒప్పుకున్నాడు సందీప్ కిషన్. ఒక్కో ఏజ్ లో ఒక్కో అమ్మాయితో డేటింగ్ చేశానని, హీరోగా మారిన తర్వాతే ఈ ఎఫైర్లన్నీ నడిచాయని కూడా చెప్పుకొచ్చాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు బ్రహ్మాండంగా ఉండేవారని, కానీ దురదృష్టవశాత్తూ వాళ్లలో ఏ ఒక్క రిలేషన్ షిప్ నిలబడలేదని ప్రకటించాడు. కానీ వాళ్ల ముగ్గుర్నుంచి తను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు.
మూడు ఎఫైర్లు నడిపానని ప్రకటించిన సందీప్ కిషన్, ఆ అమ్మాయిల పేర్లు మాత్రం చెప్పలేదు. అంతేకాదు, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే ప్రేమించి మాత్రమే పెళ్లాడతానని స్పష్టంచేశాడు. తన లేటెస్ట్ హీరోయిన్ అన్య సింగ్ తో తనకు ఎలాంటి ఎఫైర్ లేదంటున్న సందీప్ కిషన్.. దాదాపు రెండేళ్లుగా తను సింగిల్ గా ఉన్నట్టు ప్రకటించుకున్నాడు.