Telugu Global
NEWS

పదేళ్ల తర్వాత శ్రీశైలానికి రికార్డు ఇన్‌ఫ్లో

శ్రీశైలం ప్రాజెక్టు నిండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు రోజుల ముందు వరకు ఎలాంటి ప్రవాహం లేకుండా ఒట్టిపోయిన కృష్ణమ్మ ఇప్పుడు ఉరకలేస్తోంది. పదేళ్ల తర్వాత భారీ ఇన్‌ఫ్లో రికార్డు దిశగా ఎగువ నుంచి ప్రవాహం దూసుకొస్తోంది. ఆల్మట్టి, నారాయణ పూర్‌ నుంచి భారీగా వరద వస్తోంది. 2009లో శ్రీశైలం వద్ద 25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత 2009 అక్టోబర్‌లో 5.5 లక్షల ఫ్లో వచ్చింది. స్థానికంగా వచ్చిన వర్షాలు కలుపుకుని ఆ రోజు […]

పదేళ్ల తర్వాత శ్రీశైలానికి రికార్డు ఇన్‌ఫ్లో
X

శ్రీశైలం ప్రాజెక్టు నిండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు రోజుల ముందు వరకు ఎలాంటి ప్రవాహం లేకుండా ఒట్టిపోయిన కృష్ణమ్మ ఇప్పుడు ఉరకలేస్తోంది. పదేళ్ల తర్వాత భారీ ఇన్‌ఫ్లో రికార్డు దిశగా ఎగువ నుంచి ప్రవాహం దూసుకొస్తోంది.

ఆల్మట్టి, నారాయణ పూర్‌ నుంచి భారీగా వరద వస్తోంది. 2009లో శ్రీశైలం వద్ద 25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత 2009 అక్టోబర్‌లో 5.5 లక్షల ఫ్లో వచ్చింది. స్థానికంగా వచ్చిన వర్షాలు కలుపుకుని ఆ రోజు 11 లక్షల క్కూసెక్కుల ప్రవాహం కనిపించింది.

ఆ తర్వాత ఎన్నడూ భారీగా ప్రవాహం రాలేదు. ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలోకి 2 లక్షల 55వేల క్కూసెక్కుల ప్రవాహం వస్తోంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి నాలుగు లక్షల 50వేల క్కూసెక్కుల ప్రవాహాన్ని కిందకు వదిలారు. ఆ నీటిని యథాతథంగా జూరాల నుంచి కిందకు వదులుతున్నారు. రోజుకు సరాసరి 25 టీఎంసీల నీరు ప్రస్తుత 2.5లక్షల క్యూసెక్కుల ప్రవాహం వల్ల శ్రీశైలంలోకి చేరుతోంది. శ్రీశైలంలో ఇప్పటికే 133 టీఎంసీల నీరు ఉంది… మరో 80 టీఎంసీల నీరు వస్తే డ్యాం నిండిపోతుంది. ఆ వెంటనే నాగార్జున సాగర్‌కు నీరు వదులుతారు.

ఆల్మట్టి, నారాయణ పూర్‌ నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కిందకు విడుదలైన నేపథ్యంలో ఆ ప్రవాహం శ్రీశైలంను తాకితే మరింత వేగంగా డ్యాం నిండి సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు తీయనుంది. కర్నాటకలో వర్షాలు ఇప్పటికీ భారీగా కురుస్తుండడంతో నాగార్జున సాగర్‌ కూడా ఈ ఏడాది నిండడం ఖాయమని భావిస్తున్నారు.

First Published:  6 Aug 2019 8:59 PM GMT
Next Story