Telugu Global
NEWS

భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలి

ద్రావిడ్ కు నోటీసు పై దాదా, భజ్జీ గరంగరం ఇండియన్ క్రికెట్ వాల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు… పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారంటూ బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి నోటీసులు పంపడాన్ని…భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుపట్టారు. రాహుల్ ద్రావిడ్ లాంటి జెంటిల్మెన్ క్రికెటర్ కు నోటీసు పంపడాన్ని మించిన దారుణం మరొకటి లేదని… భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలంటూ.. సౌరవ్ గంగూలీ ట్విట్టర్ […]

భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలి
X
  • ద్రావిడ్ కు నోటీసు పై దాదా, భజ్జీ గరంగరం

ఇండియన్ క్రికెట్ వాల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు… పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారంటూ బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి నోటీసులు పంపడాన్ని…భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుపట్టారు.

రాహుల్ ద్రావిడ్ లాంటి జెంటిల్మెన్ క్రికెటర్ కు నోటీసు పంపడాన్ని మించిన దారుణం మరొకటి లేదని… భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలంటూ.. సౌరవ్ గంగూలీ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం భారత క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా, ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ గా ఉంటూ…రాహుల్ ద్రావిడ్ జోడు పదవుల ద్వారా.. రెండు రకాలుగా సంపాదిస్తున్నాడని… ఇది నిబంధనలకు విరుద్ధమంటూ… మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజయ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేయటంతో…ఎథిక్స్ కమిటీ అధికారి నోటీసు పంపారు. రెండు వారాలలో ద్రావిడ్ తన వివరణ పంపాలంటూ ఆదేశించారు.

దీంతో…సౌరవ్ గంగూలీతో పాటు హర్భజన్ సింగ్ సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత క్రికెట్ ను బాగుచేయటానికి రాహుల్ ద్రావిడ్ ను మించిన గొప్ప వ్యక్తి మరొకరు లేరని… అలాంటి మర్యాదస్తుడికి నోటీసు పంపడం, వివరణ కోరడం చూస్తే… భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలంటూ దాదా, భజ్జీ ట్విట్ చేశారు.

ప్రస్తుత భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్లపై ఆరోపణలు చేయటం, ఎథిక్స్ కమిటీ నోటీసు పంపి వివరణ కోరటం ఓ ప్యాషన్ గా మారిపోయిందని విమర్శించారు.

గతంలో భారత క్రికెట్ సలహామండలి సభ్యులుగా ఉన్న మాస్టర్ సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ లకు సైతం ఎథిక్స్ కమిటీ నోటీసులు పంపడంతో.. పదవుల నుంచి ఉపసంహరించుకొన్న సంగతి తెలిసిందే.

బీసీసీఐ తాజా నియమావళి ప్రకారం.. బోర్డు పదవుల్లో ఉన్న వ్యక్తులు రెండు వేర్వేరు పదవుల ద్వారా ఆర్జించటం… పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది.

First Published:  7 Aug 2019 4:36 PM IST
Next Story