రాహుల్ ద్రావిడ్‌కు నోటీసులు
మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. పరస్పర విరుద్దమైన పదవుల్లో ఉంటూ లబ్ది పొందుతున్నారన్న ఆరోపణలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. బీసీసీఐ అంబుడ్స్‌మన్- ఎథిక్స్ ఆఫీసర్ డికే జైన్ పేరుతో నోటీసులు వచ్చాయి. ద్రావిడ్ జాతీయ క్రికెట్ ఆకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఇండియా సిమెంట్స్ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇండియా సిమెంట్స్‌కు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉంది. ఇలా రెండు […]
మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. పరస్పర విరుద్దమైన పదవుల్లో ఉంటూ లబ్ది పొందుతున్నారన్న ఆరోపణలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. బీసీసీఐ అంబుడ్స్‌మన్- ఎథిక్స్ ఆఫీసర్ డికే జైన్ పేరుతో నోటీసులు వచ్చాయి.
ద్రావిడ్ జాతీయ క్రికెట్ ఆకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఇండియా సిమెంట్స్ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇండియా సిమెంట్స్‌కు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉంది. ఇలా రెండు పదవుల్లో ఉంటూ ద్రావిడ్ విరుద్ద ప్రయోజనాలను పొందుతున్నారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.
జారీ అయిన నోటీసులకు ద్రావిడ్ రెండు వారాల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో క్రికెట్ సలహా కమిటీ సభ్యులుగా సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ ఉన్న సమయంలోనూ గుప్తా ఇదే తరహా ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ఆ పదవులను వదులుకోవాల్సి వచ్చింది.