Telugu Global
NEWS

ఇదేం బెదిరింపు బాబూ..!

చంద్రబాబు మళ్ళీ రంగంలోకి దిగాడు. నిన్న గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రైతులతో సమావేశం జరిపి 2014 ఎన్నికల సందర్భంగా తాను హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ బకాయిలను జగన్‌ ప్రభుత్వం చెల్లించాలని…. అలా చెల్లించకపోతే రైతులు పన్నులు చెల్లించవద్దని చంద్రబాబు రైతులను కోరారు. రైతులంతా గ్రూపులుగా ఏర్పడి రుణమాఫీ డబ్బు చెల్లించేదాకా జగన్‌ ప్రభుత్వం మెడలు వంచేలా ఒత్తిడి తేవాలని…. అందుకు రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. […]

ఇదేం బెదిరింపు బాబూ..!
X

చంద్రబాబు మళ్ళీ రంగంలోకి దిగాడు. నిన్న గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రైతులతో సమావేశం జరిపి 2014 ఎన్నికల సందర్భంగా తాను హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ బకాయిలను జగన్‌ ప్రభుత్వం చెల్లించాలని…. అలా చెల్లించకపోతే రైతులు పన్నులు చెల్లించవద్దని చంద్రబాబు రైతులను కోరారు.

రైతులంతా గ్రూపులుగా ఏర్పడి రుణమాఫీ డబ్బు చెల్లించేదాకా జగన్‌ ప్రభుత్వం మెడలు వంచేలా ఒత్తిడి తేవాలని…. అందుకు రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రైతుల తరపున టీడీపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు చంద్రబాబు వైఖరి విచిత్రంగా ఉందని… నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి సుమారు 600 హామీలు ఇచ్చాడని…. అందులో రుణమాఫీ ఒకటని చెప్పారు.

ఈ రుణమాఫీ వల్ల కొందరు రైతులు తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారని…. కాబట్టి మనం కూడా రుణమాఫీ ప్రకటించాలని జగన్‌ మీద ఎంత ఒత్తిడి తెచ్చినా…. రుణమాఫీ సాధ్యం కాదని…. ఓడిపోయినా పర్వాలేదు గానీ అమలు చేయలేని హామీ ఇవ్వలేనని జగన్‌ చెప్పాడని…. కానీ చంద్రబాబు మాత్రం సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా 600 పైచిలుకు హామీలిచ్చి ఆ తరువాత ఆ హామీల ఎన్నికల మేనిఫెస్టోని కూడా టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించాడని గుర్తుచేశారు.

ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు…. అలాంటి తప్పుడు హామీలు ఇవ్వలేనని… రైతు రుణమాఫీ చేయలేనని చెప్పిన జగన్‌ పై ఇప్పుడు ఇలాంటి కామెంట్స్‌ చేయడం విచిత్రంగా ఉందన్నారు. రుణమాఫీ చేయడం సాధ్యమే అయితే…. అదే హామీని జగన్‌ కూడా ఇచ్చి ఉంటే…. అసలు చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచేవాడే కాదని…. జగన్‌ అయిదేళ్ళకు ముందే సీఎం పదవి చేపట్టేవాడని వైసీపీ నాయకులు అంటున్నారు.

తాను ఇచ్చిన హామీలను ఐదేళ్ళ కాలంలో నెరవేర్చలేక…. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి… ఏ మాత్రం సిగ్గులేకుండా తాను ఇచ్చిన ఎన్నికల హామీలను జగన్‌ అమలు చేయాలని కోరడం చంద్రబాబు బరితెగింపు మనస్తత్వానికి ఒక ఉదాహరణ అని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

First Published:  7 Aug 2019 11:03 AM GMT
Next Story