55 ఏళ్ల తర్వాత పాక్ తో భారత్ డేవిస్ కప్ పోరు
ఇస్లామాబాద్ వేదికగా సెప్టెంబర్లో పోటీ పూర్తిస్థాయి జట్టుతోనే బరిలో భారత్ ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నీ.. డేవిస్ కప్ లో పాక్ గడ్డపై జరిగే సమరంలో పాల్గొనటానికి భారతజట్టు…55 ఏళ్ల విరామం తర్వాత బయలుదేరి వెళుతోంది. ఆసియా-ఓషియానా జోన్ మ్యాచ్ ను సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో పాకిస్థాన్ గడ్డపై నిర్వహించనున్నారు. అయితే… ఉగ్రవాద చర్యలు, ఆటగాళ్ల భద్రత కారణాలతో భారతజట్లు పాక్ పర్యటనకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దీనికితోడు రెండు దేశాల క్రీడా సంబంధాలు సైతం అంతంత మాత్రంగానే […]
- ఇస్లామాబాద్ వేదికగా సెప్టెంబర్లో పోటీ
- పూర్తిస్థాయి జట్టుతోనే బరిలో భారత్
ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నీ.. డేవిస్ కప్ లో పాక్ గడ్డపై జరిగే సమరంలో పాల్గొనటానికి భారతజట్టు…55 ఏళ్ల విరామం తర్వాత బయలుదేరి వెళుతోంది. ఆసియా-ఓషియానా జోన్ మ్యాచ్ ను సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో పాకిస్థాన్ గడ్డపై నిర్వహించనున్నారు.
అయితే… ఉగ్రవాద చర్యలు, ఆటగాళ్ల భద్రత కారణాలతో భారతజట్లు పాక్ పర్యటనకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దీనికితోడు రెండు దేశాల క్రీడా సంబంధాలు సైతం అంతంత మాత్రంగానే ఉంటూ వస్తున్నాయి.
పాకిస్థాన్ గడ్డపై భారత్ చివరిసారిగా…1964లో లాహోర్ వేదికగా జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ లోపాల్గొనడం విశేషం. 2006లో ముంబై వేదికగా ముగిసిన పోరులో భారత్, పాక్ జట్లు ఢీ కొన్నాయి.
భారత డేవిస్ కప్ జట్టు పాక్ లో జరిగే మ్యాచ్ లో పాల్గొనటానికి సమ్మతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించడంతో భారత టెన్నిస్ సంఘం పూర్తిస్థాయి జట్టుతో తాము సిద్ధమని ప్రకటించింది.
మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా ప్రకటించిన జట్టులో…. ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, రామ్ కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని, రోహన్ బొప్పన్న, దివిజ్ శరణ్ సభ్యులుగా ఉన్నారు.
భారత ఆటగాళ్లలో ప్రజ్ఞేశ్ 90, రామ్ కుమార్ 184, సాకేత్ మైనేని 271 ర్యాంకర్లుగా ఉన్నారు. జీషన్ అలీ కోచ్ గా భారత జట్టు విజయానికి ఉరకలేస్తోంది. ఈ డేవిస్ కప్ పోటీలో నెగ్గిన జట్టు ప్రపంచ గ్రూప్ క్వాలిఫైయర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
పాక్ పై భారత్ కు తిరుగులేని రికార్డు…
పాక్ ప్రత్యర్థిగా భారత్ ఇప్పటి వరకూ ఆడిన ఆరుకు ఆరు డేవిస్ కప్ మ్యాచ్ ల్లో విజేతగా నిలిచింది. భారత్ పై పాక్ ఒక్కసారీ నెగ్గకపోడం విశేషం.
భారతజట్టు భద్రతకు పాక్ భరోసా…
ఐదున్నర దశాబ్దాల విరామం తర్వాత తమ దేశానికి రానున్న భారత డేవిస్ కప్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
భారతజట్టుపై విజయానికి తాము సిద్ధంగా ఉన్నామని పాక్ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది. పురుషుల డబుల్స్ లో ప్రపంచ 55వ ర్యాంక్ ఆటగాడు ఐసామ్ హక్ ఖురేషీ స్టార్ ప్లేయర్ గా ఉన్నాడు.