ఫరూక్ అబ్దుల్లా ఎక్కడ?
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా సభకు రాకపోవడంపై లోక్‌సభలో పలువురు ప్రశ్నించారు. ఫరూక్ అబ్దుల్లా ఎక్కడున్నారని కేంద్ర హోంమంత్రిని డీఎంకే ఎంపీ దయానిధి మారన్, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే సభలో ప్రశ్నించారు. ప్రభుత్వం ఫరూక్‌ను నిర్బంధించని పక్షంలో ఆయన సభకు వచ్చి ఉండేవారని… కశ్మీర్‌కు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్నా తోటి ఎంపీ అచూకీ లేకపోవడంపై సమాధానం చెప్పాలని నిలదీశారు. తన పక్క సీట్లోనే ఫరూక్ అబ్దుల్లా కూర్చునే వారని… […]
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా సభకు రాకపోవడంపై లోక్‌సభలో పలువురు ప్రశ్నించారు. ఫరూక్ అబ్దుల్లా ఎక్కడున్నారని కేంద్ర హోంమంత్రిని డీఎంకే ఎంపీ దయానిధి మారన్, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే సభలో ప్రశ్నించారు.
ప్రభుత్వం ఫరూక్‌ను నిర్బంధించని పక్షంలో ఆయన సభకు వచ్చి ఉండేవారని… కశ్మీర్‌కు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్నా తోటి ఎంపీ అచూకీ లేకపోవడంపై సమాధానం చెప్పాలని నిలదీశారు.
తన పక్క సీట్లోనే ఫరూక్ అబ్దుల్లా కూర్చునే వారని… కానీ కశ్మీర్‌పై చర్చ జరుగుతున్న ఈ రోజు ఆయన ఇక్కడ లేరని.. తన దృష్టిలో ఫరూక్ అబ్దుల్లా సభలో లేకుండా ఈ అంశంపై ఎంత చర్చ జరిగినా అది అసంపూర్ణమే అవుతుందని సుప్రియా అభిప్రాయపడ్డారు.
ఫరూక్‌ను అరెస్ట్ చేశారని.. కానీ దానిపై ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదని దయానిధి ఆందోళన వ్యక్తం చేశారు. సభలోని సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని వ్యాఖ్యానించారు.
ఇందుకు స్పందించిన స్పీకర్… ఒకవేళ ఫరూక్‌ను అరెస్ట్ చేసి ఉంటే ముందే తనకు సమాచారం ఇచ్చి ఉండేవారని… కానీ తన వద్ద అలాంటి సమాచారం లేదని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
ఫరూక్ అబ్దుల్లా ఆచూకీపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఫరూక్‌ను తాము అరెస్ట్ చేయలేదని… నిర్బంధించలేదని చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా ఆయన ఇంటిలోనే సురక్షితంగా ఉన్నారని అమిత్ షా వివరణ ఇచ్చారు.