ఆర్టికల్ 370కి కారణం మీ వల్లభాయ్ పటేలే....
లోక్ సభలో కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు పై హాట్ హాట్ చర్చ సాగింది. బీజేపీ తరుఫున హోంమంత్రి అమిత్ షా ఆవేశపూరిత ప్రసంగం చేశారు. కశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేస్తానన్నారు. పీవోకే, సియాచిన్ మనదేనన్నారు. కశ్మీర్ రావణకాష్టంలా మారిందంటే నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూనే కారణమని… విలీనం చేయకుండా స్వయం ప్రతిపత్తి ఇచ్చి కాశ్మీర్ ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడని మండిపడ్డారు. కీలకమైన ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
లోక్ సభలో కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు పై హాట్ హాట్ చర్చ సాగింది. బీజేపీ తరుఫున హోంమంత్రి అమిత్ షా ఆవేశపూరిత ప్రసంగం చేశారు. కశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేస్తానన్నారు. పీవోకే, సియాచిన్ మనదేనన్నారు. కశ్మీర్ రావణకాష్టంలా మారిందంటే నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూనే కారణమని… విలీనం చేయకుండా స్వయం ప్రతిపత్తి ఇచ్చి కాశ్మీర్ ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడని మండిపడ్డారు.
కీలకమైన ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తొలి ప్రధాని నెహ్రూను విమర్శించిన హోంమంత్రి అమిత్ షాకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ ను భారత్ లో కలుపుకొని ఆర్టికల్ 370 ను తేవడంలో నాటి ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్, కశ్మీర్ సీఎం అబ్దుల్లా, అయ్యర్ లు కీలక చర్చలు జరిపారని.. కమిటీలు ఏర్పాటు చేశారన్నారు.
బీజేపీ గొప్పగా చెప్పుకుంటున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ కశ్మీర్ కు ఇలాంటి స్వయం ప్రతిపత్తిని ఇవ్వడంలో ప్రధానపాత్ర పోషించాడని… మీ నేతనే ఇదంతా చేశాడని శశిథరూర్ కడిగిపారేశారు.
ఇక కశ్మీర్ బిల్లు కాంగ్రెస్ పక్షాన తాము రిజెక్ట్ చేస్తున్నామని శశిథరూర్ స్పష్టం చేశారు. దీనిపై వెంటనే అఖిలపక్ష మీటింగ్ పెట్టి కశ్మీర్ కు నేతలంతా వెళ్లి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాకే ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.